Bhagyashree: రాధేశ్యామ్.. ఉపయోగం శూన్యం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.....

Bhagyashree: రాధేశ్యామ్.. ఉపయోగం శూన్యం!

No Use Of Radhe Shyam For Bhagyashree

Updated On : March 15, 2022 / 6:12 PM IST

Bhagyashree: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కించాడని, ప్రభాస్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీ అవుతుందని ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేశారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్ రోజున మాత్రం అన్నీ తారుమారయ్యాయి.

ఈ సినిమాకు చిత్ర యూనిట్ చెప్పినంత సీన్ లేదని తొలి ఆటకే రిజల్ట్ ఇచ్చేశారు ఆడియెన్స్. దీంతో ఈ సినిమాకు విపరీతమైన నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. రాధేశ్యామ్ చాలా స్లోగా సాగడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఎందుకు ఉందో కూడా ప్రేక్షకులకు అర్ధం కాలేదట. ఈ సినిమాలో కొన్ని పాత్రలు చాలా వీక్‌గా ఉండటంతో అవి సినిమాలో తేలిపోయాయని క్రిటిక్స్ అంటున్నారు.

Bhagyashree: అక్కడ అన్నీ పాత కథలే.. బాలీవుడ్‌పై భాగ్యశ్రీ కామెంట్స్!

ముఖ్యంగా ఈ సినిమాలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తుందనే వార్తతో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. కాగా రాధేశ్యామ్ చిత్రంలో ఆమె ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తుందని తెలుసుకుని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తుందని, ఆమెకు ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని వారందరూ ఆశించారు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్రను వెండితెరపై చూసిన ఆడియెన్స్, ఆమె అభిమానులు పెదవి విరిచారు.

అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రను ఆమె ఎందుకు చేసిందా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ తల్లిగా నటించిన భాగ్యశ్రీకి నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్రను దర్శకుడు అంటగట్టాడని సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె ఓ డ్యాన్సర్‌గా నటించింది. పోనీ డ్యాన్స్‌కు సంబంధించి ఏదైనా ప్రత్యేక ప్రాధాన్యత ఉందా అంటే అది కూడా లేదు. అసలు భాగ్యశ్రీ లాంటి నటి ఇలాంటి పాత్రను ఎలా అంగీకరించిందని ఆమె అభిమానులు కొందరు మండిపడుతున్నారు.

Radhe Shyam: థమన్ నుండి స్పెషల్ ట్రీట్.. ఏమై ఉంటుందబ్బా?

ఏదేమైనా ఒకప్పుడు ‘ప్రేమపావురాలు’(హిందీలో ‘మైనే ప్యార్ కియా’) వంటి సినిమాతో ఇండియావైడ్‌గా అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ప్రాధాన్యత లేని పాత్రలను ఎందుకు ఎంచుకుంటుందా అని వారు తెగ బాధపడుతున్నారు. అసలు రాధేశ్యామ్ చిత్రం వల్ల భాగ్యశ్రీకి ఎలాంటి ఉపయోగం కలగలేదని వారు కామెంట్ చేస్తున్నారు.