Bhagyashree: అక్కడ అన్నీ పాత కథలే.. బాలీవుడ్‌పై భాగ్యశ్రీ కామెంట్స్!

తెలుగు సినిమాలో నటిస్తావా అని ఒకప్పుడు ఏరికోరి అడిగినా ఊహూ అన్నారు బాలీవుడ్ హీరోయిన్స్. కానీ ఇప్పుడు ఊ అంటున్నారు. ఓ అడుగు ముందుకేసి వాళ్లే మన తెలుగు హీరోలతో నటించేందుకు..

Bhagyashree: అక్కడ అన్నీ పాత కథలే.. బాలీవుడ్‌పై భాగ్యశ్రీ కామెంట్స్!

Bhagyashree

Updated On : March 3, 2022 / 8:21 PM IST

Bhagyashree: తెలుగు సినిమాలో నటిస్తావా అని ఒకప్పుడు ఏరికోరి అడిగినా ఊహూ అన్నారు బాలీవుడ్ హీరోయిన్స్. కానీ ఇప్పుడు ఊ అంటున్నారు. ఓ అడుగు ముందుకేసి వాళ్లే మన తెలుగు హీరోలతో నటించేందుకు సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అంతా టాలీవుడ్ మేకర్స్ పిలుపు వస్తే మేము రెడీ అని ఓపెన్ గానే చెప్పేశారు. దీపికా పదుకొనె, అలియా భట్, అనన్య పాండే లాంటి వాళ్ళు ఇప్పటికే సినిమాలు చేసేస్తున్నారు కూడా.

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు ఫెడవుట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా టాలీవుడ్ వైపే చూస్తున్నారు. వాళ్ళ రీఎంట్రీ కూడా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాతోనే బెటర్ అంటున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కు తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు
.
ఈ సందర్భంగా భాగ్యశ్రీ ఇప్పుడు బాలీవుడ్ లో అన్నీ పాత కథలు కాపీ కథలే వస్తున్నాయని.. తెలుగు మలయాళ ఇండస్ట్రీలో కొత్త స్క్రిప్ట్స్, కొత్త కథలు వస్తున్నాయని చెప్పారు. కొత్త టాలెంట్, ఓటిటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా స్థాయి రోజు రోజుకు ఇంటర్నేషనల్ స్థాయికి మారుతుందని, ప్రజలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను, అలాంటి కథలనే ఇష్ట పడుతున్నారని చెప్పారు.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

హిందీ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ అని చూడకుండా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యంగ్ జనరేషన్ నుంచి కొత్త కథలు, కొత్త సినిమాలు వస్తున్నాయని.. అందుకే తానూ న్యూ టాలెంట్ పీపుల్స్ తో వర్క్ చేయడానికి సిద్ధంగా వున్నానని చెప్పారు. ఇన్నాళ్లు ఫ్యామిలీ వల్ల యాక్టింగ్ కి దూరంగా వున్నానని.. ఇప్పుడు పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారని.. ఇప్పుడు కనుక మంచి రోల్స్ వస్తే బాషలతో సంబంధం లేకుండా తప్పకుండా చేస్తానని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.