Srikanth Tyagi apologized: దిగొచ్చిన బీజేపీ లీడర్.. సోదరిలాంటిదని చెబుతూ క్షమాపణలు
నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెప్పుడూ ఎవరితో ఇలా ప్రవర్తించను

Noida BJP leader Srikanth Tyagi apologized
Srikanth Tyagi apologized: నోయిడా హౌసింగ్ సొసైటీలో ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడటమే కాకుండా, ఆమెపై దాడి చేసిన బీజేపీ కిసాన్ మర్చాకు చెందిన శ్రీకాంగ్ త్యాగీ ఎట్టకేలకు తన తప్పు తెలుసుకున్నానని అన్నారు. గొడవ పడిన మహిళ తనకు సోదరిలాంటిదని, క్షమించాలని బహిరంగంగా వేడుకున్నారు. మంగళవారం అతడిని మీరట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి నోయిడాకు తీసుకువచ్చారు. ఒకరోజు విచారణ అనంతరం సదరు మహిళకు క్షమాపణలు చెబుతూ తన తప్పు తెలుసుకున్నట్లు త్యాగి ప్రకటించారు.
‘‘నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెప్పుడూ ఎవరితో ఇలా ప్రవర్తించను’’ అని త్యాగి బుధవారం అన్నారు. సోమవారం త్యాగి నివాసంలోని అక్రమ కట్టడాల్ని నోయిడా అడ్మినిస్ట్రేషన్ బుల్డోజర్లతో కూల్చివేసింది. నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సె సొసైటీలోని సెక్టార్-93బీకి పోలీసులతో పాటు అధికారులు చేరుకుని ఈ తతంగాన్ని పూర్తి చేశారు.
కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలాడటం, దాడి చేయడం వంటివి చేశారు. త్యాగిపై గతంలో కూడా కేసులు ఉన్నాయట. 2007 నుంచి ఆయనపై అదే మహిళ తొమ్మిది కేసులు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. బెదిరింపులు, నేరపూరిత చర్యలు, అల్లర్లు, హింస వంటి చర్యల కింద ఈ కేసులు నమోదు అయ్యాయి. 2020లో త్యాగిపై హత్యాయత్నం, క్రమినల్ కేసులు నమోదైంది. తాజా కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Minister Nitin Gadkari : మంత్రులు ఏం చెప్పినా అధికారులు ‘ఎస్ సార్’ అనాల్సిందే‘