Banks Strike : నవంబర్ 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె .. బ్యాంక్, ఏటీఎం సర్వీసులపై ప్రభావం
నవంబర్ 19న బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఏటీఎంలతోపాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడనుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

November 19th strike of bank employees..
Banks Strike : నవంబర్ 19న బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఏటీఎంలతోపాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడనుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. నవంబర్ 19 మూడో శనివారం. సాధారణంగా ప్రతి నెలా మొదటి, మూడో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి. రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం నోటీసు ఇచ్చారు. తమ సభ్యులు ఈ నెల 19.1112022న సమ్మెలోకి వెళ్లాలని ప్రతిపాదించారని ఆ నోటీసు సారాంశం. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ సంగతి వెల్లడించింది. సమ్మె జరిగిన రోజుల్లో బ్యాంకు శాఖలు, ఆఫీసుల్లో కార్యకలాపాలు సజావుగా సాగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని..కానీ సమ్మె కార్యరూపం దాల్చినట్లయితే .. ఇబ్బందులు తప్పవని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.