Male Pregnancy: మగాళ్లకూ గర్భం.. చైనా తొలిదశ ప్రయోగాలు!

జన్మనివ్వడం ఆడవారికి ఓ వరం. నవమాసాలు మోసి పురిటినొప్పులు భరించి ఓ బిడ్డకు జన్మనివ్వడంలో ఆడవాళ్ళకు ఓ సంతృప్తి. అయితే.. అలాంటి కష్టాలు ఆడవాళ్లకే ఉండాలా.. మగవాళ్ళు కూడా ఆ నొప్పి భరిస్తే తెలుస్తుంది ఆడవారి గొప్పదనం ఏంటో అనేవాళ్ళు కూడా ఉన్నారు.

Male Pregnancy: మగాళ్లకూ గర్భం.. చైనా తొలిదశ ప్రయోగాలు!

Male Pregnancy

Updated On : June 19, 2021 / 6:51 PM IST

Male Pregnancy: జన్మనివ్వడం ఆడవారికి ఓ వరం. నవమాసాలు మోసి పురిటినొప్పులు భరించి ఓ బిడ్డకు జన్మనివ్వడంలో ఆడవాళ్ళకు ఓ సంతృప్తి. అయితే.. అలాంటి కష్టాలు ఆడవాళ్లకే ఉండాలా.. మగవాళ్ళు కూడా ఆ నొప్పి భరిస్తే తెలుస్తుంది ఆడవారి గొప్పదనం ఏంటో అనేవాళ్ళు కూడా ఉన్నారు. త్వరలోనే మగాళ్లకు కూడా ఆ పురిటి నొప్పులు తెప్పిస్తామంటున్నారు చైనా పరిశోధకులు. మగవాళ్లలో కూడా ప్రెగ్నెన్సీపై చైనా ముమ్మర పరిశోధనలు చేస్తుంది.

నిజానికి మగాళ్లకు గర్భంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు.. పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, మిగతా దేశాలు ఈ అంశంపై పరిశోధనలు నిషేధం విధించగా చైనా మాత్రం ముమ్మరంగా చేపడుతుంది. ముందుగా తొలిదశలో ఎలుకలపై ప్రయోగాలు జరిపిన చైనా శాస్త్రవేత్తలు మగవాళ్లలో కూడా గర్భం సాధ్యమేనని చెప్తున్నారు. త్వరలో మనుషులపై కూడా ప్రయోగాలు మొదలుపెడతామని.. విజయం సాధిస్తామని చెప్తున్నారు.

ముందుగా ఆడ ఎలుకలలోని గర్భసంచిని తొలగించి మగ ఎలుకకు ఆ గర్భసంచిని సర్జరీ ద్వారా అమర్చి ఈ ప్రయోగాలు జరిపారని వెల్లడించారు. షాంఘైలోని నావల్ మెడికల్ యూనివర్శిటీ జరిపిన ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో జరిగగా.. దీనికి ర్యాట్ మోడల్ 6 అని పేరు పెట్టారు. ఈ ప్రయోగంలో గర్భం దాల్చిన మగ ఎలుక మొత్తం 10 పిల్లలకు జన్మనివ్వగా సిజేరియన్ చేసి బయటకు తీశారు.