డబ్బుల కోసం 100 సంవత్సరాల తల్లిని బ్యాంకుకు లాక్కెళ్లింది

ప్రభుత్వం వేసిన డబ్బులు తీసుకోవడానికి 100 సంవత్సరాల తల్లిని లాక్కెళ్లిందో కూతురు. ఈ విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖాతాదారు ఉంటేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని బ్యాంకు అధికారి చెప్పడంతో ఆ విధంగా చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని జిల్లా కలెక్టర్ ఖండించారు. బ్యాంకు మేనేజర్ వెరిఫికేషన్ కోసం ఆమె ఇంటికి వెళ్లకముందే..ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.
బార్గావూన్ కు చెందిన పుంజీమతి దేవి (60)..నివాసం ఉంటోంది. ఈమెకు 100 సంవత్సరాల లబే భాగెల్ తల్లి ఉంది. కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం…ఇటీవలే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకే కింద..జన్ ధన్ యోజన ఖాతాదారులకు రూ. 500 వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా…ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన డబ్బులను వేసింది.
జూన్ 09వ తేదీన డబ్బులను డ్రా చేసుకొనేందుకు ఉత్కల్ బ్యాంకుకు వెళ్లింది. కానీ..డబ్బులు డ్రా చేసుకోవాలంటే..ఖాతాదారు ఉండాల్సిందేనని బ్యాంకు అధికారి అజిత్ ప్రధాన్ చెప్పినట్లు ఆరోపణలున్నాయి. దీంతో పుంజీమతి దేవి..తన తల్లిని మంచంపై పడుకొబెట్టి…బ్యాంకు వరకు లాక్కెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కలెక్టర్ మధుస్మిత సాహూ స్పందించారు. తాను ఇంటికి వచ్చిన వెరిఫేకషన్ చేస్తానని చెప్పారని, కానీ అంతలోనే తల్లిని బ్యాంకుకు లాకొచ్చిందని వెల్లడించారు.