HDFC Bank : ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయిన HDFC బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్

వృత్తిలో చాలా సీనియర్. తోటి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.. ఎందుకో సహనం కోల్పోయాడు. ఆన్ లైన్ మీటింగ్ లో తోటి ఉద్యోగులను నానా దుర్భాషలాడాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలితంగా HDFC బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ అయ్యాడు.

HDFC Bank : ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయిన HDFC బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్

HDFC Bank

Viral News : HDFC బ్యాంకు ఉద్యోగుల ఆన్ లైన్ సమావేశం జరుగుతోంది. అందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న పుష్పల్ రాయ్ తోటి ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన పై అధికారులు వెంటనే అతనిని సస్పెండ్ చేశారు.

Girls Break Piggy Bank : రూ.2000 నోట్ల కోసం పిగ్గీ బ్యాంకును బద్దలు కొట్టారు.. ఆ తరువాత ఏమైంది?

కోల్‌కతా బ్రాంచ్‌లో 16 ఏళ్లుగా క్లస్టర్ హెడ్‌గా పనిచేస్తున్న పుష్పల్ రాయ్ రీసెంట్‌గా జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బెంగాలీలో అరుస్తు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉద్యోగులపట్ల రాయ్ ప్రవర్తన చూసి జనం షాకయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై HDFC బ్యాంకు స్పందిస్తూ ప్రాథమిక విచారణ ఆధారంగా రాయ్‌ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

 

ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం.. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని ఉద్యోగులందరినీ గౌరవంగా చూడాలని బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. రాయ్ చార్టర్డ్ అకౌంటెంట్. గతంలో PwC మరియు ICICI బ్యాంకులలో పని చేశారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఉద్యోగులపట్ల ప్రవర్తించిన తీరు అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. మీటింగ్‌లో రాయ్ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  Sara అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ‘రాయ్ ఉద్యోగుల పట్ల అనైతికంగా ప్రవర్తించారని.. ఉద్యోగులు ఎందుకు సహిస్తున్నారో తెలియలేదని.. వెంటనే అతనిని తొలగించాలనే’ శీర్షికతో ఈ పోస్టు వైరల్ అవుతోంది.

2000 Rupee Note: బ్యాంకుల్లో నేటి నుంచి 2వేల నోట్లు మార్చుకోవచ్చు.. ఒకేసారి ఎన్ని నోట్లు మార్చుకోవచ్చో తెలుసా?

చాలామంది రాయ్ తీరును తప్పు పడుతున్నారు. బ్యాంకు అధికారులు అతనిపట్ల సరైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఒక సీనియర్‌గా చిన్న ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన రాయ్ తప్పు చేశారని మండిపడ్డారు.