Girls Break Piggy Bank : రూ.2000 నోట్ల కోసం పిగ్గీ బ్యాంకును బద్దలు కొట్టారు.. ఆ తరువాత ఏమైంది?
బీరువాల్లో.. పోపుల పెట్టెలో.. చీర మడతల కింద దాచుకున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. ఇద్దరు చిన్నారులు బద్దలు కొట్టిన పిగ్గీ బ్యాంకులో ఎంత డబ్బుందో చూస్తే షాకవుతారు.

Girls Break Piggy Bank
Viral Video : రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటామని ఆర్బీఐ ప్రకటన చేసిన తరువాత చాలామంది రూ.2000 నోట్లను బయటకు తీస్తున్నారు. పిగ్గీ బ్యాంకులో, చీరల మడతలో, పోపుల డబ్బాల్లో, బీరువాల్లో రహస్యంగా దాచుకున్న నోట్లు కూడా బయటకు వస్తున్నాయి. వీటిపై బోలెడు ఫన్నీ వీడియోలు కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా ఇద్దరు చిన్నారులు రూ.2000 నోట్ల కోసం తమ పిగ్గీ బ్యాంకును బద్దలు కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.
Delhi : రూ. 2000 నోటు ఇవ్వండి.. రూ.2,001 విలువైన వస్తువులు పట్టుకెళ్లండి
thevasimbuilder అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో చిన్నారులు పిగ్గీ బ్యాంకును బద్దలు కొట్టారు. చూసినవారు ఆశ్చర్యపోయేలా ఐదువందలు, రెండువేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. ‘ఇంత డబ్బు.. ఓ మై గాడ్.. నేను ఉదయం పిగ్గీ బ్యాంకులో వేస్తే సాయంత్రం తీసేస్తాను’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోని 36 మిలియన్ల కంటే ఎక్కువమంది చూసారు. చాలామంది కామెంట్లు చేశారు.
‘నా పిగ్గీ బ్యాంకులో ఇంత డబ్బు నేను ఎప్పుడూ దాచుకోలేదు’ అని ఒకరు.. ‘హలో ఆదాయపు పన్ను శాఖ’ అంటూ.. ఫన్నీగా మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. ఇలా పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులో రూ.2000 నోట్లు ఉంటే బద్దలు కొట్టక తప్పనిసరి కదా.. చాలామంది ఇదే పనిలో ఉన్నారని ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకున్నారు.
View this post on Instagram