Karnataka: ఘోర ప్ర‌మాదం.. అంబులెన్సులోంచి ముగ్గురు ఎగిరిప‌డ్డ వైనం.. న‌లుగురి మృతి

కర్ణాటకలోని ఉడుపిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగి న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. రోగి, అత‌డి ఇద్ద‌రు బంధువుల‌తో ప్ర‌యాణిస్తోన్న అంబులెన్స్ అతి వేగంగా వ‌చ్చి టోల్ ప్లాజా వ‌ద్ద అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో అందులోని వారంతా ఆ వేగానికి బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రొక‌రికి గాయాల‌య్యాయి.

Karnataka: ఘోర ప్ర‌మాదం.. అంబులెన్సులోంచి ముగ్గురు ఎగిరిప‌డ్డ వైనం.. న‌లుగురి మృతి

Ambulance

Updated On : July 21, 2022 / 7:42 AM IST

Karnataka: కర్ణాటకలోని ఉడుపిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగి న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. రోగి, అత‌డి ఇద్ద‌రు బంధువుల‌తో ప్ర‌యాణిస్తోన్న అంబులెన్స్ అతి వేగంగా వ‌చ్చి టోల్ ప్లాజా వ‌ద్ద అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో అందులోని వారంతా ఆ వేగానికి బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రొక‌రికి గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన‌ దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ అంబులెన్స్ హార‌న్ కొడుతూ దూసుకొచ్చినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

NASA: ప్లూటో యొక్క అద్భుతమైన రెయిన్‌బో ఇమేజ్‌ను షేర్ చేసిన నాసా

అంబులెన్స్ వేగంగా వ‌స్తుండ‌డాన్ని గుర్తించిన టోల్‌ ప్లాజా సిబ్బంది అక్క‌డ‌ అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించారు. అయిన‌ప్ప‌టికీ వ‌ర్ష‌పు నీళ్ళు ఉండ‌డంతో డ్రైవ‌ర్ అంబులెన్సును అదుపుచేయ‌లేక‌పోయాడు. ఒక్క‌సారిగా బ్రేక్ వేశాడు. టోల్ ప్లాజా వ‌ద్ద ఓ దూడ కూడా ఉంది. దాన్ని త‌ప్పించే క్ర‌మంలో డ్రైవర్‌ బ్రేక్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఓ వ్య‌క్తి అంబులెన్స్ నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో దాని కింద‌ప‌డిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.