బాలాజీకి కొబ్బరికాయ కొట్టండి.. అంతా మంచే జరుగుతుంది : కేంద్రమంత్రి

కరోనా రోగి కుటుంబానికి జోధ్పూర్ ఎంపి, కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ఇచ్చిన సూచన చర్చనీయాంశం అయింది. ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి..

బాలాజీకి కొబ్బరికాయ కొట్టండి.. అంతా మంచే జరుగుతుంది : కేంద్రమంత్రి

Patient Said To The Patients Family The Doctors Are Doing A Great Job You Offer Coconut To Balaji Everything Will Be Alright

Updated On : April 26, 2021 / 6:40 PM IST

gajendra singh shekhawat says coconut to balaji : కరోనా రోగి కుటుంబానికి జోధ్పూర్ ఎంపి, కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ఇచ్చిన సూచన చర్చనీయాంశం అయింది. ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి జోధ్పూర్ లోని వివిధ ఆసుపత్రిలను సందర్శించారాయన. ఈ క్రమంలో MDM ఆసుపత్రిని సందర్శించారు.. ఆ సమయంలో ఒక రోగి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వైద్యం విషయంలో మంత్రి సహాయం కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి షెకావత్.. వారిని ఓదార్చి.. ‘వైద్యులు వారి పని వారు చేస్తున్నారు, బాలాజీకి కొబ్బరికాయ కొట్టండి.. అంతా మంచే జరుగుతుంది’ అని సమాధానమిచ్చారు. ఇలా చెప్పిన అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. మంత్రి స్పందనకు ఖంగుతిన్న మహిళలు నిరాశతో వెనుదిరిగారు.. షెకావత్ తమకేదో సహాయం చేస్తాడు అనుకుంటే దేవుడి మీద నెట్టివేసి వెళ్ళా వెళ్లిపోయాడేంటి అని అనుకోవడం వారి వంతైంది.

వాస్తవానికి, జోధ్‌పూర్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజు రోజుకు వందలాది కేసులు పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచినప్పటికీ, రోగులతో అన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఏప్రిల్ 18 నుండి ప్రతిరోజూ 1,400కి పైగా కేసులు నగరంలో వస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆదివారం ఇక్కడ కొత్తగా 1,412 మంది రోగులను గుర్తించారు.