Patrayani Sangeeta Rao : ‘కలైమామణి’ పట్రాయని సంగీత రావు గారు ఇకలేరు..
‘కలైమామణి’ శ్రీ పట్రాయని సంగీత రావు గారు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నైలో బుధవారం రాత్రి 9 గంటలకు పరమపదించారు..

Patrayani Sangeeta Rao Passes Away Due To Covid
Patrayani Sangeeta Rao: ‘కలైమామణి’ శ్రీ పట్రాయని సంగీత రావు గారు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నైలో బుధవారం రాత్రి 9 గంటలకు పరమపదించారు..
అలనాటి తెలుగు సినీ సంగీత మూల విరాట్టు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి మేధస్సుకూ సామర్ధ్యానికీ మూలకారకులు, వారి గురువు గారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి పుత్రుడు మరియు ఆయనకు సహాయ సంగీత దర్శకుడిగా పని చేశారు..
ఎన్నో కూచిపూడి నృత్య నాటకాలకు సంగీతం సమకూర్చారు.. వెంపటి చిన సత్యం గారికి చాలా కార్యక్రమాలకు పట్రాయని సంగీత రావు గారు సంగీతమందించారు.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ వర్గాల వారు ఆయనకు నివాళులర్పిస్తున్నారు..