Pawan Kalyan : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్..
పవర్‌స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇటీవల కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నారు. పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు..

Pawan Kalyan
Pawan Kalyan: పవర్‌స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇటీవల కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నారు. పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు.
తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పూజలు చేశారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి.. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.
మూడేళ్ల విరామంత తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే హిస్టారికల్ సినిమాతో పాటు, సాగర్ కె.చంద్ర డైరెక్షన్‌లో రానా దగ్గుబాటితో కలిసి మలయాళీ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు పవర్‌స్టార్..