పిల్లలతో పవన్ భార్య.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Pawan Kalyan Family: ఇటీవల కొణిదెల నిహారిక పెళ్లిలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కనిపించకపోవడంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా పవన్ శ్రీమతి అన్నా లెజినోవా, కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.
ఇటీవల రష్యా వెళ్లిన పవన్ భార్య, పిల్లలు తాజాగా నగరానికి తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక వీరిని చూసి గుర్తుపట్టి కొందరు ఫొటోలు తీశారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. పిల్లల పక్కన పవన్ ఫొటోలు పెట్టి, ఫొటోషాప్‌లో మంచి మంచి డిజైన్స్ చేసి పలు సామాజికమాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా పవన్ భార్య, పిల్లలు ఇటీవల క్రిస్మస్ వెకేషన్ కోసం వెళ్లినట్లుగా సమాచారం.