కుర్రాళ్లలో ఒంటరితనం.. చుట్టుపక్కల వాళ్లను చూస్తే… అనుమానం. ఏమైంది వీళ్లకి? సర్వేలు ఏం చెబుతున్నాయి?

  • Published By: srihari ,Published On : June 2, 2020 / 12:47 PM IST
కుర్రాళ్లలో ఒంటరితనం.. చుట్టుపక్కల వాళ్లను చూస్తే… అనుమానం. ఏమైంది వీళ్లకి? సర్వేలు ఏం చెబుతున్నాయి?

Updated On : June 2, 2020 / 12:47 PM IST

 

ఈ కాలం కుర్రాళ్లంటే ఉరిమే ఉత్సాహం… ఫుల్ జోష్… ఎనర్జీ. ఇలా చాలానే అనేసుకొంటాం. ఎప్పుడూ హడావిడిగా చాట్ చేస్తూ కనిపించే ఈ కుర్రాళ్ల రహస్య జీవితంలోకి ఓ సర్వే తొంగిచూసింది. మనకు పైకి కనిపించే ఉత్సాహం వెనుకున్న అసలు కారణాలను బైటకు తీసింది.

నీకెంతమంది ఫ్రెండ్స్?
22శాతం మంది కుర్రాళ్లు చెప్పింది…. సున్నా అంట. 30 ఏళ్లకు మించినవాళ్లలో ఫ్రెండ్స్ 9 శాతం అంట. వాట్? అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేటెస్ట్‌గా ఓ సర్వే చేస్తే… అందులో చెప్పిన సంగతులివి. social relationships ఒక్కటే కాదు… అసలు ఈ కుర్రాళ్లు పక్కవాళ్ల గురించి ఏమనుకొంటున్నారు? సమాధానం కాస్త భయపెడుతోంది. 

Pew survey ప్రకారం… 30 ఏళ్లలోపు వాళ్లలో అర్జున్ రెడ్డిలా తమగురించి మాత్రమే ఆలోచించుకొనేవాళ్లు 73శాతం. వీళ్లంతా స్వార్ధపరులా? వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. మిగిలిన వాళ్లను సంగతిని పట్టించుకోరు. పక్కప్లాట్‌లో ఎవరున్నా వీళ్లకు అనవసరం. అదే 65 ఏళ్లు దాటినవాళ్లలో పొరుగువాళ్ల గురించి ఆలోచించేవాళ్లు 48శాతం. మీకు ఓ అవకాశం ఉంది. పక్కవాళ్ల గురించి ఆలోచించకుండా మీరు దాన్ని అందుకొంటారా అంటే, కుర్రాళ్లలో 71శాతం యస్ అన్నారు. అదే 65ఏళ్లుదాటినవాళ్లలో 39శాతం మాత్రమే స్వార్ధంగా ఆలోచిస్తారంట. 

మనతో పనిచేసేవాళ్లు, లేదంటే ఇరుగుపొరుగువాళ్లను మీరు నమ్ముతారా అని అడిగితే కుర్రాళ్లలో 70శాతం మేం అస్సలు నమ్మని గట్టిగా చెప్పారు. అదే సీనియర్ సిటిజన్స్ మాత్రం నమ్ముతామని అన్నారు. నమ్మనివాళ్లు కేవలం 29 శాతం మాత్రమే. ఈ కాలం యువతలో ఆత్మహత్యలు చేసుకొనేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే సూసైడ్స్ రేట్ కూడా ఎక్కువే. 15-19, 20-24 ఏజ్ గ్రూప్స్‌లో ఆత్మహత్యలు చేసుకోవాలని వాళ్ల సంఖ్య 2000 తర్వాత బాగా పెరిగిందని Pew survey చెబుతోంది. ముఖ్యంగా 15-19 ఏజు గ్రూపు కుర్రాళ్లలో ఈ రేటు భయపెడుతోందన్నది సైకాలజిస్ట్‌ల మాట. 

ఈ అబ్బాయిలు, అమ్మాయిలు ఒంటరివాళ్లు. అనుమానం ఎక్కువ. పాతతరంతో పోలిస్తే ఉద్యోగ భద్రత తక్కువే. చాలామందికి చదివిన చదువుకన్నా, చేస్తున్న పని తక్కువే. అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. చాలామంది కొత్తగా వస్తున్న ఉద్యోగాల్లో ఒకదాన్ని ఎంచుకొని స్థిరపడుతున్నారు తప్ప… కోరుకున్న జాబ్‌ను అందుకోలేకపోతున్నారు. ప్రతి నలుగురి కుర్రాళ్లలో ఒకరికి క్లోజ్ ఫ్రెండ్స్ లేరు.

జనం చాలా స్వార్ధపరులని 30 ఏళ్లలోపు యువతలో ఎక్కువమంది నమ్మతున్నారు. అవకాశం వస్తే మనం అందుకోవాలి. పక్కవాళ్ల గురించి ఆలోచించకక్కర్లేదు. అసలు ఎవరినీ నమ్మక్కర్లేదన్న ధోరణి ఎక్కువ. పోనీ చేస్తున్న ఉద్యోగం సంతృప్తినిస్తోందా అంటే? లేదు. సగం జాబ్‌లకు ఇంటర్, డిగ్రీచాలు. అయినా సర్దుకు పోతున్నారు. ఇలాంటి ట్రెండ్స్ వల్లనే ఒంటిరి తనం పెరిగి, సుసైడ్ రేటు పెరుగుతుందని అంటున్నారు సైకాజలిస్ట్‌లు. ఈ ధోరణి అమెరికాదో, ఇండియాదోకాదు. ప్రతిచోటా ఇంటే.