పూజాను న్యూడ్ ఫొటో అడిగిన నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిందిగా!..

Pooja Hegde: సెలబ్రిటీలకు పాపులారిటీతో పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా పెరుగుతుంటారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారు స్టార్స్. ఇన్‌స్టా లైవ్‌లోనూ ఆడియన్స్‌తో కనెక్ట్ అవుతుంటారు సెలబ్స్.
తాజాగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఇన్‌స్టాలో లైవ్ ఇచ్చింది. ఒక నెటిజన్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న పిక్ షేర్ చెయ్యమని అడగ్గా.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో తీసుకున్న క్యూట్ పిక్ పోస్ట్ చేసింది.
ఈ క్రమంలో ఓ ఆకతాయి పూజని న్యూడ్ పిక్ పంపమని అడిగాడు.. అతడి ప్రశ్న చదివాక ఎవరికైనా చికాకొస్తుంది కానీ పూజా కూల్‌గా, అందరూ అదుర్స్ అనేలా ఆన్సర్ ఇచ్చింది. నగ్నంగా ఫొటో అడిగిన వ్యక్తి చెంప చెళ్లుమనేలా తన రెండు కాళ్లను పిక్ తీసి షేర్ చేసింది. దీంతో పూజా రాక్స్.. నెటిజన్ షాక్స్.. అన్నట్లైంది పరిస్థితి.