Prabhas as Vishwamitra: విశ్వామిత్రుడిగా ప్రభాస్.. ఫోటో వైరల్!

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా 'ఆదిపురుష్'‌, 'సలార్'‌ సినిమాలను కూడా లైన్లో పెట్టేసి షూటింగ్ మొదలుపెట్టాడు. ఇదిలా వుంటే సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అరుదైన ఫొటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. గతంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా నటించిన స్టిల్ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Prabhas as Vishwamitra: విశ్వామిత్రుడిగా ప్రభాస్.. ఫోటో వైరల్!

Prabhas As Vishwamitra Photo Goes Viral

Updated On : April 11, 2021 / 5:01 PM IST

Prabhas as Vishwamitra: బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా ‘ఆదిపురుష్’‌, ‘సలార్’‌ సినిమాలను కూడా లైన్లో పెట్టేసి షూటింగ్ మొదలుపెట్టాడు. వీటి తర్వాత ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఒక సినిమాకు పనులు జరుగుతున్నట్లు వినిపిస్తుంది. ఇవి కాకుండా మరో రెండు కథలు చర్చలలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రభాస్ మరో రెండేళ్లకు సరిపడా సినిమాలు సిద్ధం చేసుకున్నాడు.

ఇదిలా వుంటే సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అరుదైన ఫొటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. గతంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా నటించిన స్టిల్ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ తో ఛత్రపతి సినిమాను తెరకెక్కించిన తర్వాత మంచి స్నేహం కుదిరింది. దీంతో రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమా నిర్మాణ సంస్థ బ్యానర్ లోగో కోసం ప్రభాస్ తో నటింపజేశారు. యమదొంగ సినిమాను రాజమౌళికి సన్నిహితులు చెర్రీ, ఊర్మిల గుణ్ణం నిర్మించారు. అప్పటి వరకు వీరికి సొంత బ్యానర్ లేకపోగా యమదొంగ సినిమాతో విశ్వామిత్ర క్రియేషన్స్ స్థాపించారు.

ఈ బ్యానర్‌ లోగో కోసం విశ్రామిత్రుడి గెటప్‌ అవసరం కాగా దానికి ప్రభాస్‌ కరెక్ట్‌గా సెట్‌ అవుతారని అంతా అనుకుని ఒప్పించారు. సినిమా మొదట్లో ఈ బ్యానర్ పేరు పడే సమయంలో విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ కనిపించగా ఆయన ఆకాశం వైపు కమండలాన్ని చూపించగానే విశ్వామిత్ర క్రియేషన్స్ అని వస్తుంది. ప్రభాస్ ఈ గెటప్ లో అచ్చంగా విశ్వామిత్రుడిని దింపేశాడు. యమదొంగ తర్వాత ఈ బ్యానర్ మరో సినిమాను నిర్మించకపోవడంతో ప్రభాస్ గెటప్ కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.