డార్లింగ్‌తో తెలుగు డైరెక్టర్లు కష్టమేనా?

Prabhas: ప్రభాస్‌తో సినిమాలు చెయ్యాలనుకున్న తెలుగు డైరెక్టర్లకి ఇప్పుడప్పుడే ఛాన్స్ లేనట్టే.. ఎందుకంటే ప్రభాస్.. బాలీవుడ్ మీద కన్నేశారు. ఈ మధ్య తన ప్రతి సినిమానీ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న ప్రభాస్.. బాలీవుడ్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే ప్రభాస్ ‘ఆదిపురుష్’ తర్వాత నెక్ట్స్ సినిమా కూడా బాలీవుడ్‌లోనే చేస్తూ దూకుడు చూపిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్‌గా పేరు వచ్చిన దగ్గరనుంచి ప్రభాస్.. ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ మీద బాగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. అసలు ‘బాహుబలి’ రిలీజ్ తర్వాత అయితే అటు బాలీవుడ్ స్టార్లందరూ ప్రభాస్‌తో సినిమా చెయ్యడానికి వెయిట్ చేసేంత క్రేజ్ సంపాదించుకున్నారు ప్రభాస్. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికే బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలు సైన్ చేస్తున్నారు. ప్రభాస్ ఆల్రెడీ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు.
ఆల్రెడీ ఓం రౌత్ సినిమా పనులు స్పీడ్‌గా చేస్తూ ప్రభాస్ బాలీవుడ్‌లో దూకుడు చూపిస్తున్నారు. వైడ్ రేంజ్‌లో ఆడియన్స్‌ని సంపాదించుకోవాలన్న ఉద్దేశ్యంతో నెక్ట్స్ సినిమాని కూడా బాలీవుడ్ డైరెక్టర్‌తోనే చెయ్యబోతున్నారు. ‘వార్’ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ సినిమా చేస్తున్నారంటూ అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
గ్రాండ్‌గా సినిమాల్ని తెరకెక్కించడం, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా రేంజ్‌ని పెంచడం.. ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్న సిద్ధార్థ్‌తో ప్రభాస్ సినిమా చేస్తున్నారని న్యూస్. అయితే ఆ సినిమా ‘వార్’ కి సీక్వెల్ అని, ‘వార్ 2’ లో హృతిక్ రోషన్‌తో పాటు టైగర్ ష్రాఫ్ ప్లేస్‌లో ప్రభాస్‌ని రీప్లేస్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఆల్రెడీ స్టోరీలు అల్లేసుకుంటున్నారు. అసలు రాబోయే 2,3 ఏళ్లు అసలు ఖాళీ లేకుండా డేట్స్ డైరీ ఫిల్ చేసుకున్న ప్రభాస్.. సిద్దార్ద్ ఆనంద్‌తో సినిమా చేసేది నిజమేనా అంటూ కొంతమంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు.