‘సలార్’ సెలక్షన్స్.. ప్రభాస్‌తో మీరూ నటించొచ్చు..

  • Published By: sekhar ,Published On : December 9, 2020 / 01:37 PM IST
‘సలార్’ సెలక్షన్స్.. ప్రభాస్‌తో మీరూ నటించొచ్చు..

Updated On : December 9, 2020 / 1:42 PM IST

Salaar Movie Auditions: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఇటీవల టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.

SALAAR

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటించబోయే నటీనటులకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
డిసెంబర్ 15వ తేది ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ జరుగనున్నాయి.


ఏజ్ లిమిట్ లేదు, ఏ భాషలోనైనా నటించి ఒక నిమిషం నిడివితో ఉన్న వీడియోను వాట్సాప్ చేయొచ్చని తెలిపారు. త్వరలో చెన్నై, బెంగుళూరులోనూ ఆడిషన్స్ నిర్వహించనున్నారు.

SALAAR