Bandi Sanjay Padayatra : బీజేపీ ప్రభుత్వం వచ్చేవరకు పాదయాత్ర కొనసాగుతుంది-బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు బండి సంజయ్.

Bandi Sanjay Padayatra : బీజేపీ ప్రభుత్వం వచ్చేవరకు పాదయాత్ర కొనసాగుతుంది-బండి సంజయ్

Updated On : August 16, 2022 / 7:33 PM IST

Bandi Sanjay Padayatra : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు బండి సంజయ్.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై దాడి చేసే వారిని పోలీసులు కంట్రోల్ చేయకుండా టీఆర్ఎస్ నేతలకు కొమ్ము కాస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ తోనే తమకు పోటీ అన్న బండి సంజయ్.. బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.

”తెలంగాణలో నిజాం పాలన సాగుతోంది. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని మార్చేందుకే ప్రజా సంగ్రామ యాత్రను మొదలు పెట్టా. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయి. మాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మాపై దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఒకవేళ సర్కారు చేయని పక్షంలో మెడలు వంచి జరిపిస్తాం” అని బండి సంజయ్ అన్నారు.