Prakash Raj starts Appu Express : అప్పు ఎక్స్‌ప్రెస్‌.. పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం అంబులెన్స్‌లని దానం చేసిన ప్రకాష్ రాజ్…

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ మంచిపనికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవలో భాగమయ్యేందుకు............

Prakash Raj starts Appu Express : అప్పు ఎక్స్‌ప్రెస్‌.. పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం అంబులెన్స్‌లని దానం చేసిన ప్రకాష్ రాజ్…

prakash raj starts appu express

Updated On : August 8, 2022 / 7:14 AM IST

Prakash Raj starts Appu Express :   కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం దేశ వ్యాప్తంగా ఎంతో మందిని కలిచివేసింది. హీరోగానే కాక, ఎన్నో మంచి పనులతో కన్నడ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఆయన మరణాన్ని కన్నడ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నేటికీ ఏదో ఒక కార్యక్రమంతో పునీత్ ని గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ మంచిపనికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవలో భాగమయ్యేందుకు ప్రకాశ్‌ రాజ్‌ పునీత్ ని గుర్తు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పునీత్ ని అభిమానులు ముద్దుగా పిలుచుకునే అప్పు పేరు మీద అప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరుతో అంబులెన్స్‌ సేవలను మొదలు పెట్టారు.

Malashri Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సీనియర్ నటి కూతురు

appu express

 

ఇందులో భాగంగా మైసూరులోని మిషన్‌ ఆస్పత్రికి మొదటి అప్పు ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ను ప్రకాశ్‌ రాజ్‌ అందజేశారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ సేవలని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కన్నడ ప్రజలు, పునీత్ అభిమానులు ప్రకాష్ రాజ్ ని అభినందిస్తున్నారు.