Malashri Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సీనియర్ నటి కూతురు

వారసుడొచ్చాడు, ఊర్మిళ, బావ బామ్మర్ది..లాంటి ఎన్నో తెలుగు, కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మాలాశ్రీ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. తాజాగా మాలాశ్రీ కూతురు రాధన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

Malashri Daughter :  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సీనియర్ నటి కూతురు

malashri daughter radhana ram

Updated On : August 8, 2022 / 6:50 AM IST

Malashri Daughter :  ఇటీవల ఒకప్పుడు హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన చాలా మంది సీనియర్ నటీమణుల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో సీనియర్ నటి కూతురు కూడా ఎంట్రీ ఇవ్వనుంది. వారసుడొచ్చాడు, ఊర్మిళ, బావ బామ్మర్ది..లాంటి ఎన్నో తెలుగు, కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మాలాశ్రీ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. తాజాగా మాలాశ్రీ కూతురు రాధన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

కన్నడ హీరో దర్శన్‌ 56వ సినిమాలో రాధన హీరోయిన్ గా నటించబోతోంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం నాడు బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు.

Keerthy Suresh: కళావతి.. అవుతోందా శ్రీమతి?

radhana ram debue as heroine

 

ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. ”రాధనాకు శుభాకాంక్షలు. నన్ను ఎలా ఆదరించారో ప్రేక్షకులు ఆమెని కూడా ఆదరించాలి. రాక్‌లైన్‌ నా సినిమాతో ప్రొడక్షన్‌లోకి అడ్డుపెట్టి ఇప్పుడు నా కూతుర్ని నటిగా పరిచయం చేస్తున్నారు. నన్ను చూసి చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ లో శిక్షణ కూడా తీసుకుంది. నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపింది.