Narendra Modi: కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆదివారం మంత్రులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.

Narendra Modi: కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

Narendra Modi

Updated On : June 20, 2021 / 4:46 PM IST

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆదివారం మంత్రులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.

జూన్ 24న జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్న నేపథ్యంలో నేడు ఏర్పాటైన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన/విస్తరణ వార్తల నేపథ్యంలో ఈ వరుస భేటీలు రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తున్నాయి. దాదాపుగా అన్ని సమావేశాల్లోనూ జేపీ నడ్డాతో పాటు ముఖ్య మంత్రులు పాల్గొనడంతో మంత్రివర్గంలో భారీ మార్పులకు ఆస్కారం ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తోందని పరిశీలకులు అంటున్నారు.

పైకి మాత్రం కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్, జమ్మూకాశ్మీర్ తదనంతర పరిణామాలపై చర్చించేందుకే అని చెబుతున్నప్పటికీ.. రెండేళ్ల పాలనలో మంత్రుల పనితీరును సమీక్షించేందుకే సమావేశాలు జరుగుతున్నాయని, ఆ తర్వాతే మంత్రివర్గ ప్రక్షాళనపై ఓ ప్రకటన రావచ్చని అభిప్రాయపడుతున్నారు.