లాక్‌డౌన్‌లో.. దిల్ రాజు రెండో పెళ్లి.. పెళ్లి కూతుర్ని చూశారా?

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 06:37 AM IST
లాక్‌డౌన్‌లో.. దిల్ రాజు రెండో పెళ్లి.. పెళ్లి కూతుర్ని చూశారా?

Updated On : October 31, 2020 / 2:14 PM IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకొన్నారు. 2017లో  ఆయన భార్య అనిత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. కొన్నిరోజులుగా దిల్ రాజు పెళ్లి వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపించింది. తన రెండో పెళ్లిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఆదివారం తన సొంతూరుకు దగ్గరలోని ఓ దేవాలయంలో ఆదివారం రాత్రి వివాహం చేసుకున్నారు. దిల్ రాజు రెండోపెళ్లికి సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
dilraju wife

భార్య మృతితో మానసికంగా దిల్ రాజు కుంగిపోవడంతో ఆయనకు తోడు కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. పెళ్లికి ఒప్పించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ దిల్ రాజు తన వివాహాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా నిజామాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు.

Dilraju photos

తన పెళ్లి విషయాన్ని ఆదివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. దిల్ రాజు వివాహానికి సినీ ప్రముఖులు సైతం దూరంగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యుల్లో కొంతమందిలో మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. 

Read Here>> రియల్ హీరో.. ఆ గ్రామం గుండెల్లో కొలువైన ఇర్ఫాన్ ఖాన్