‘రుద్ర’ గా పవర్‌స్టార్..

‘రుద్ర’ గా పవర్‌స్టార్..

Updated On : February 10, 2021 / 9:11 PM IST

PSPK 28: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం:12 గా.. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్, రానాలపై ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్ని వేశాలను చిత్రీకరించారు దర్శకుడు సాగర్.కె.చంద్ర.

Pawan Kalyan

పవన్ షూటింగులో జాయిన అయిన ఫస్ట్ డే ఆయనకు వెల్‌కమ్ చెబుతూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక అప్పటినుండి సోషల్ మీడియాలో పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, డిఫరెంట్ టైటిల్స్ దర్శనమిస్తున్నాయి.

తాజాగా ‘రుద్ర’ (వర్కింగ్ టైటిల్) పేరుతో డిజైన్ చేసిన పవన్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్ అవుతోంది. కాకపోతే ఈ మూవీలో పవన్ క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నారు. ఫొటో పాతదే అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది.

RANA

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే- డైలాగ్స్ రాస్తున్నారు. ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా.. థమన్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ళ సినిమాటొగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan ? (@leaderpawankalyan.k)