global food and energy crises: అంతా మీ వల్లే జరిగింది: పుతిన్
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నెలకొంటోన్న ఆహార, విద్యుత్తు సంక్షోభానికి పాశ్చాత దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు.

Putin2
global food and energy crises: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నెలకొంటోన్న ఆహార, విద్యుత్తు సంక్షోభానికి పాశ్చాత దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఉక్రెయిన్ మీదుగా ఎగుమతి అవుతోన్న ఆహార పదార్థాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార మార్కెట్‌లో నెలకొంటోన్న సంక్షోభానికి రష్యానే కారణమంటూ కొన్ని దేశాలు తమపై నింద వేస్తున్నాయని ఆయన అన్నారు.
Kerala: కేరళలోని 3 జిల్లాల్లో కరోనా కేసుల విజృంభణ
ఆయా దేశాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై పాశ్చాత దేశాలు విధించిన ఆంక్షల వల్ల కేవలం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌పై మాత్రమే ప్రభావం పడిందని, వాటి ధరలు పెరిగాయని ఆయన అన్నారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్ సంక్షోభంలో పడుతోందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. తమ దేశాల్లో ఆహార, విద్యుత్ సంక్షోభాలకు ఆ యుద్ధమే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.