Vladimir Putin: మరింత క్షీణించిన పుతిన్ ఆరోగ్యం?
కేన్సర్‌తో బాధపడుతోన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (69) ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ దేశ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి ఒకరు చెప్పారు.

Putin
Vladimir Putin: కేన్సర్‌తో బాధపడుతోన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (69) ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ దేశ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి ఒకరు చెప్పారు. పుతిన్ మరో మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు చెప్పారన్నారు. అలాగే, పుతిన్ కంటిచూపు కూడా కోల్పోతున్నారని, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ఒకవేళ మీడియాతో మాట్లాడాలని పుతిన్ అనుకుంటే ఆయన తన ప్రసంగ సారాంశాన్ని పేపర్లపై పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుని రావాల్సి ఉంటుందని చెప్పారు.
Rajya Sabha polls: కె.లక్ష్మణ్ సహా 8 మంది బీజేపీ నేతలు నామినేషన్ల దాఖలు
లేదంటే ఆ అక్షరాలకు చదివేందుకు కళ్లు సహకరించవని వివరించారు. పుతిన్ కాళ్లు కూడా వణుకుతున్నాయని తెలిపారు. మరోవైపు, పుతిన్ మే నెలలోనే కేన్సర్ సర్జరీ చేయించుకున్నారని, వైద్యుల సూచనలతో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారని రష్యా అధికారులు కొందరు అంటున్నారు. పుతిన్ ఆరోగ్యంపై జరుగుతోన్న ప్రచారంపై రష్యా విదేశాంగ శాఖ స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని పేర్కొంది.