QR code on Gangireddu : గంగిరెద్దుకు QR కోడ్‌..ఇది డిజిటల్‌ చెల్లింపుల విప్లవం అంటున్న మంత్రి నిర్మలా సీతారామన్

ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్‌ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ షేర్ చేశారు.

QR code on Gangireddu : గంగిరెద్దుకు QR కోడ్‌..ఇది డిజిటల్‌ చెల్లింపుల విప్లవం అంటున్న మంత్రి నిర్మలా సీతారామన్

Qr Code On Gangireddu

Updated On : November 5, 2021 / 5:40 PM IST

QR code on Gangireddu head : స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే జేబులో డబ్బులు ఉండనవసరం లేదు.QR కోడ్ స్కాన్ చేయటం డబ్బులు పంపించటం. డిజిటల్‌ పేమెంట్స్‌ బాగా పెరిగిన క్రమంలో జాంపళ్లు కొన్నా..జాగ్వార్ కార్ కొన్నా..కిళ్లీకొట్టునుంచి మాల్స్ వరకు, పానీపూరీ బండి నుంచి పాన్ షాప్ వరకు, నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా గూగుల్‌ పే, ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌లే కన్పిస్తున్నాయి. స్కాన్ చేయండి డబ్బులు పంపించండీ అంటున్నాయి.

డీమానిటేషన్ తరువాత ఈ పరిస్థితి  బాగా పెరిగింది. ఈ డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగి డబ్బుల్ని కంటికి కనిపించకుండానే మాయం అయిపోతున్నాయి. మనం సంపాదించిన డబ్బులు మనకు కనిపించకుండానే ఈ QR కోడ్‌ ద్వారానే బయటకు వెళ్లిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ డిజిటల్ చెల్లింపులు వచ్చాక కొనుగోలు కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.

Read more : WhatsApp : వాట్సాప్‌లో మీకు నచ్చినవారికి ‘Happy Diwali Sticker’ ఇలా పంపుకోవచ్చు..!

ఈ క్రమంలో దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్‌ చేశారు. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్‌ రూపంలో భిక్షాటన చేస్తున్నారని ఈ వీడియో సారాంశం. వెనుకడికి చైనాలో డిజిటల్ బెగ్గర్స్ పెరిగారని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం కూడా అలాగే తయారయ్యాం. ఇది మంచికో చెడికో పక్కన పెడితే అంతా డిజిటల్ మయం అయిపోయిందనటానికి గంగిరెద్దుకు QR కోడ్‌ వీడియో ఉదాహరణగా కనిపిస్తోంది. ఈనాటి డిజిటల్ యుగంలో వృత్తిదారులు డిజిటల్ చెల్లింపులే అడుగుతున్నారని తెలుస్తోంది.

ఈ వీడియోలో గంగిరెద్దు తలపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను అమర్చగా.. ఓ వ్యక్తి దాన్ని స్కాన్‌ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి భిక్ష పంపించాడు. ఈ వీడియోను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘‘గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో ఇది. ఇందులో వారు క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా భిక్షం తీసుకుంటున్నారు. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరింది’’ అని చెప్పుకొచ్చారామె.
Read more :  Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!