Unstoppable episode 4 : రజినీకాంత్ పెద్ద బోరింగ్ మనిషి.. రాధిక!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి కలిసి బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి హాజరయ్యారు. అయితే ఇదే షోలో ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కూడా సందడి చేసింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ పెద్ద బోరింగ్ మనిషి అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Unstoppable episode 4 : రజినీకాంత్ పెద్ద బోరింగ్ మనిషి.. రాధిక!

Raadhika said Rajinikanth is a boring person

Updated On : November 25, 2022 / 1:21 PM IST

Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.

Unstoppable episode 4 : సురేష్ రెడ్డిని స్పీకర్‌గా ఎంపిక చేసినప్పుడు వైఎస్సార్ నాకొక మాట చెప్పి, సురేష్‌కి ఇంకొక మాట చెప్పాడు.. కిరణ్ కుమార్ రెడ్డి!

ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఇదే షోలో ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కూడా సందడి చేసింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ పెద్ద బోరింగ్ మనిషి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. రజినీకాంత్ తో నువ్వు నటించావు కదా, అతనిలో నీకు నచ్చని విషయం ఏంటని బాలయ్య, రాధికని ప్రశ్నించాడు.

ఆమె బదులిస్తూ.. ‘తన పని తను చూసుకుంటూ, ఏదొక మూలాన కూర్చుని, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఉంటాడు. పెద్ద బోరింగ్ మనిషి’ అంటూ వ్యాఖ్యానించింది. అలాగే కమల్ హాసన్ లో నచ్చనిది.. ‘ఆయనికి తన ప్రొఫెషన్ మీద ఫోకస్ తప్ప, మరొకటి ఉండదు’ అంటూ కామెంట్లు చేసింది.