Food services in Train : అన్ని రైళ్లలో ఆహార సేవలు ప్రారంభం..

కరోనా తగ్గింది. ఇక అన్ని అన్ని రైళ్లలో ఆహార సేవలు ప్రారంభం కానున్నాయి.

Food services in Train : అన్ని రైళ్లలో ఆహార సేవలు ప్రారంభం..

Food Services In Train

Updated On : November 24, 2021 / 12:47 PM IST

Food service in Trains : కరోనా కేసులు తగ్గాయి. థర్డ్ వేవ్ అంటూ భయపడ్డాం. కానీ ఆ సూచనలేవీ కనిపించట్లేదు..పైగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈక్రమంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైళ్లలో ఆహార సేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ తగ్గుముఖం పట్టటంతో ఆహార సేవలు పునఃప్రారంభించనుంది. అన్ని రైళ్లలో ఆహారం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సీటీసీ, జోన్ల కమర్షియల్‌ మేనేజర్లను రైల్వే బోర్డును ఆదేశించింది రైల్వే శాఖ.

Read more : Telangana : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు..అతివేగానికి 24

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఆహార సేవలను పునరుద్ధరిస్తున్నామని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని, దురంతో, శతాబ్ది, వందే భారత్‌, తేజస్‌, గతిమాన్‌ రైళ్లలో అందుబాటులోకి ఆహార సేవలు పునరుద్ధరిస్తున్నామని ప్రకటించింది. రైళ్లలో దూరప్రయాణాలు చేసే వారికి ఈ నిర్ణయం శుభవార్త చెప్పింది. రైళ్లలో ఆహారం అందించే సేవలను పునరుద్ధరించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్​ (ఐఆర్​సీటీసీ) ఓ లేఖలో (IRCTC on Food servies in Train) పేర్కొంది.

కరోనా సంక్షోభం తర్వాత.. రైల్వే సేవలు దాదాపుగా పునఃప్రారంభమైన క్రమంలో అన్ని రైళ్లలోను ఆహార సేవలు కొనసాగుతాయని ఐఆర్​సీటీసీ ప్రకటించింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఇప్పటికే కొవిడ్ నిబంధనల నడుమ కార్యకలాపాలు సాగుతున్నవిషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రైళ్లలో కూడా అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఆహారం అందించే సేవలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది ఐఆర్​సీటీసీ.

Read more : Hyderabad CP : చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

అన్ని రైళ్లలో ఆహార సేవలను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్‌, తేజస్‌, గతిమాన్‌ రైళ్లలో ఈ ఆహార సరఫరా సేవలు అందుబాటులోకి రానున్నాయి.