Telangana : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు..అతివేగానికి 24

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. కానీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనంపై 28 చలాన్లు ఉన్నాయి. దీంతో రూల్స్ సామాన్యులకేనా? అధికారులకు కావా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Telangana : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు..అతివేగానికి 24

28 E Challan On Kamareddy Collector Vehicle (1)

28 e-challan on kamareddy collector vehicle : ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. రూల్స్ పాటించాల్సిన ప్రభుత్వ అధికారులే..రూల్స్ బ్రేక్ చేస్తే..వారికి ఫైన్ ఎవరు వేస్తారు? చిత్తశుద్ధితో దానికి సంబంధించిన అధికారులే జరిమానా విధించాలి.. చర్యలు తీసుకోవాలి. అదే చేశారు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ట్రాఫిక్ పోలీసులు. ఏకంగా కలెక్టర్ వాహనానికే చనాలను విధించారు. కానీ మరి కలెక్టర్ ఆ చనాలు చెల్లించారా? అంటే అదేమీ లేనట్లుగా తెలుస్తోంది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనంపై ఒకటీ రెండూ కాదు ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్ 16 ఈఈ 336 6) పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20 వరకు ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఈ చలానాల ప్రకారం… మొత్తం రూ.27,580 జరిమానా కట్టాల్సి ఉంది. మరి చలానాలు ఎందుకు విధించారు అంటూ అతి వేగం. ఈ చనాలా్లో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం.

Read more : Old Vehicle : పాత వాహనం రోడ్డుపైకి వస్తే ఫైన్ కట్టాల్సిందే!

ఏకంగా కలెక్టర్ వాహనంపైనే 28 చనాలు ఉండటంతో సదరు కలెక్టర్ గారి వాహనం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దేశాన్ని పాలించే నాయకుల నుంచి సామాన్యుల వరకు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే. కానీ కలెక్టర్ గారి వాహనంపై ఇన్ని చనాలాలు ఉండటంతో నెటిజన్లు అధికారులే రూల్స్ పాటించకపోతే ఎలా? అనీ..ప్రజలకు ఒక రూలు..అధికారులకు మరొక రూలా? అని ప్రశ్నిస్తున్నారు.కలెక్టర్లు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. దీంట్లో కామారెడ్డి కలెక్టర్ మొదటి వ్యక్తి కూడా కాదు. గతంలో జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి కేసే ఉంది. గత సెప్టెంబర్ లో అది బయటపడింది. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేళ్లలో (2021, ఆగస్టు 30వ తేదీ వరకు) ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు అతి వేగం కారణం కాగా..మరొకటి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద క్రాస్ చేసినందుకు చలానాలు విధించారు.

Read more : వాహనాలపై ఇష్టమొచ్చిన రాతలు రాసుకుంటే జేబులు ఖాళీయే..

ఈ చలానాల మొత్తం రూ.22,100 కాగా, యూర్ ఛార్జీలు రూ.805 కలపుకుని మొత్తం 22,905 రూపాయలు ఉంది. ఈ చలానాల్లో సగానికి పైగా హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకే విధించడం గమనార్హం. అయితే అప్పట్లో దీనిమీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.వాహనం మీద ఒక్క చలానా పెండింగ్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తామంటూ ప్రకటించిన పోలీసులు ఇలా పదుల సంఖ్యలో Challans pending లో ఉన్న కలెక్టర్ మీద ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసులు కలెక్టర్ వాహనం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అధికారుల వాహనాలపై కూడా తగు చర్యలు, నియమ నింబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.