Hyderabad Rains : హైదరాబాద్‌‌కు భారీ వర్ష హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.

Hyderabad Rains : హైదరాబాద్‌‌కు భారీ వర్ష హెచ్చరిక

Updated On : August 2, 2022 / 9:19 AM IST

Hyderabad Rains :  హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.

ఎల్.బి నగర్ మలక్‌పేట, కోఠీ, అసెంబ్లీ, లకడికపూల్, ఖైరతాబాద్ ల్లో వర్షం కురుస్తోంది. కాగా…ఉప్పల్ ,తార్నాక, హబ్సిగూడ రాంనగర్ ,విద్యానగర్ సెక్రటేరియట్ ,మాసబ్ ట్యాంక్, పంజా గుట్ట ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర ప్రజలను బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉన్నందున…ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు తమ ప్రయాణాన్ని గంట సేపు వాయిదా వేసుకోవాలని కోరారు. వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటికి రావాలని పోలీసులు కోరుతున్నారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముఖ్యమైన రోడ్లలో కాకుండా ఇతర మార్గాల ద్వారా తమ గమ్యానికి వెళ్ళాల్సిందిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.