Prabhas – Rajamouli : ప్రభాస్‌తో రాజమౌళి మరో సినిమా?.. శంకర్ – చరణ్ సినిమా ఎప్పుడంటే..

రాజమౌళితో మళ్లీ బ్లాక్ బస్టర్ కాంబో ఇవ్వనున్నారా.. శంకర్ ప్రాజెక్ట్‌కు ఇప్పట్లో ముహూర్తం లేనట్టేనా.. త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు?..

Prabhas – Rajamouli : ప్రభాస్‌తో రాజమౌళి మరో సినిమా?.. శంకర్ – చరణ్ సినిమా ఎప్పుడంటే..

Prabhas Rajamouli

Updated On : June 3, 2021 / 2:50 PM IST

Prabhas – Rajamouli: రాజమౌళితో మళ్లీ బ్లాక్ బస్టర్ కాంబో ఇవ్వనున్నారా.. శంకర్ ప్రాజెక్ట్‌కు ఇప్పట్లో ముహూర్తం లేనట్టేనా.. త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు?.. ఇలా ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. వీళ్ల ముగ్గురి ప్రాజెక్ట్స్ విషయంలో ట్రెండింగ్ స్టోరీస్ నడుస్తున్నాయి. ఆ గాసిప్స్ అసలు మ్యాటరేంటి?..

‘ఛత్రపతి’, ‘బాహుబలి’ 2 పార్ట్స్ తర్వాత.. ప్రభాస్, రాజమౌళి కాంబోలో ఓ సినిమా రానుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘ట్రిపుల్ ఆర్’ తో రాజమౌళి బిజీగా ఉన్నారు. తర్వాత మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ బాకీ ఉంది. అటు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు ప్రభాస్. మహేష్ మూవీ తర్వాత జక్కన్న.. సైన్ చేసిన సినిమాలు పూర్తైన తర్వాత డార్లింగ్.. కొత్త సినిమాతో పట్టాలెక్కనున్నట్టు గాసిప్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ రావడం ఖాయం.

ఈ జూలైలోనే సెట్స్ పైకెళ్లాలనుకున్నారు శంకర్ – చరణ్. కానీ పాండెమిక్ ప్రభావంతో సాధ్యమయ్యేలా లేదు. మరోవైపు డైరెక్టర్ శంకర్‌ని ‘ఇండియన్ 2’, ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ వివాదాలు చుట్టుముట్టాయి. వీటికి సొల్యూషన్ దొరకాలంటే టైం పట్టేలా ఉంది. అందుకే ‘ఆచార్య’, ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత ఏం చేయాలనే దానిపై రామ్ చరణ్ ప్లాన్ బి రెడీ చేస్తున్నారని టాక్. జూన్ మిడిల్ నుంచి లైన్‌లో ఉన్న దర్శకుల కథలు వినేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.