Rajasthan : ఒకే వేదికపై ఒక్కటైన 2,143 జంటలు.. రెండు ప్రపంచ రికార్డులు.. ఎక్కడంటే?

రాజస్ధాన్‌లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.

Rajasthan : ఒకే వేదికపై ఒక్కటైన 2,143 జంటలు.. రెండు ప్రపంచ రికార్డులు.. ఎక్కడంటే?

Rajasthan

Rajasthan : రాజస్థాన్‌లో జరిగిన సామూహిక వేవాహ వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి. ఒకే వేదికపై 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఈ వేడుకలో హిందూ, ముస్లిం వివాహాలు జరగడం విశేషం.

Guinness World Records: 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన శివ నారాయణ్ జ్యువెలర్స్

రాజస్థాన్‌లోని బరన్‌లో ‘శ్రీ మహావీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్’అనే రిజస్టర్డ్  ట్రస్ట్ సామూహిక వివాహ వేడుకలు నిర్వహించింది. 6 గంటలపాటు కొనసాగిన ఈ వేడుకల్లో హిందు, ముస్లింల వివాహాలు జరిగాయి. 12 గంటల్లో అత్యధిక జంటలు.. 24 గంటల్లో వివాహం చేసుకున్న జంటల పేర్లతో ఉన్నపాత  రికార్డ్స్‌ను ఈ ఈవెంట్ బీట్ చేసింది.

costly sandwich : వరల్డ్ రికార్డ్ సాధించిన ఆ శాండ్ విచ్ ధర వింటే అదిరిపడతారు

ఈ వేడుకకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, క్యాబినెట్ మంత్రి ప్రమోద్ జైన్ భాయాతో సహా పలువురు అధికారులు హాజరయ్యారు. కొత్త జంటలను ఆశీర్వదించారు. ట్రస్ట్ ప్రతి జంటకు నగలతో పాటు, బహుమతులు అందించింది. పరుపు, వంట పాత్రలు, టీవీ మరియు ఫ్రిజ్‌లు అందించారు. నిరుపేద జంటలు పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రారంభించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.