త్వరలోనే పెళ్లి.. తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయిన రణ్‌బీర్..

త్వరలోనే పెళ్లి.. తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయిన రణ్‌బీర్..

Updated On : December 25, 2020 / 11:13 AM IST

Ranbir Kapoor – Alia Bhatt: బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల ప్రేమ వ్యవహారం గతకొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌ టాపిక్.. వీరి ప్రేమ గురించి, పెళ్లి గురించి నేషనల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి, మీడియాలో తమపై వస్తున్న వార్తల గురించి ఇప్పటివరకు రణ్‌బీర్ పెద్దగా స్పందించలేదు కానీ తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో ఆలియాతో ప్రేమాయణం గురించి మాట్లాడాడు రణ్‌బీర్..

‘మహమ్మారి మన జీవితాల్లోకి ప్రవేశించకపోయి ఉంటే ఈపాటికి మా పెళ్లి అయిపోయి ఉండేది. పెళ్లి గురించి ఇప్పుడు ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. కానీ, ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవాలనుకుంటున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఆలియా గిటార్ నుంచి స్క్రీన్ రైటింగ్ వరకు చాలా విషయాలు నేర్చుకుంది. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపాను. కొన్ని పుస్తకాలు చదివాను. ప్రతిరోజూ రెండు, మూడు సినిమాలు చూశాను’ అని రణ్‌బీర్ తెలిపాడు.

Ranbir Kapoor - Alia Bhatt

తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగం..
సీనియర్ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ దాదాపు రెండు సంవత్సరలపాటు లుకేమియాతో పోరాడి ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. తండ్రితో గడిపిన చివరి రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రణ్‌బీర్ కపూర్.

Ranbir Kapoor’s Emotional For Father Rishi Kapoor