Rashmika Mandanna: షాకింగ్.. వాళ్ళ వ్యాపారం కోసం ఏకంగా హీరోయిన్ కు గుండు కొట్టేశారు!

ష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా టాప్ గేర్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ అని లేకుండా సౌత్ ఇండియా మొత్తం దున్నేస్తున్న ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా దండయాత్ర మొదలుపెట్టింది. రష్మిక బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తుండగా సౌత్ లో చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

Rashmika Mandanna: షాకింగ్.. వాళ్ళ వ్యాపారం కోసం ఏకంగా హీరోయిన్ కు గుండు కొట్టేశారు!

Rashmika Mandanna

Updated On : April 21, 2021 / 3:32 PM IST

Rashmika Mandanna: రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా టాప్ గేర్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ అని లేకుండా సౌత్ ఇండియా మొత్తం దున్నేస్తున్న ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా దండయాత్ర మొదలుపెట్టింది. రష్మిక బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తుండగా సౌత్ లో చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు రష్మిక చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతూ ముంబై టూ హైదరాబాద్ తెగ చక్కర్లు కొట్టేస్తుంది.



ఎప్పుడూ జుట్టుతో అందంగా కనిపించే రష్మిక గుండుతో కనిపిస్తే అభిమానులు తట్టుకోగలరా? కానీ తమిళనాడులో మాత్రం రష్మిక గుండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. కొందరు తమ వ్యాపారం కోసం ఆమె గుండు ఫోటోలను ఉపయోగించుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని సెలూన్ల ముందు గుండు లుక్ లో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా సెలూన్ల కోసం హీరోల ఫోటోలను ఉపయోగించుకోవడం ఎక్కువగా జరుగుతుంది. అలా కాకుండా తమిళనాడులో హీరోయిన్స్ ఫోటోలను గుండు కొట్టి మరీ వాళ్ళ ప్రచారానికి వాడుకుంటారు.

Rashmika Mandanna

Rashmika Mandanna




గతంలో కీర్తి సురేష్‌, నయనతార రష్మిక ఫోటోలను ఉపయోగించుకోగా ఇప్పుడు రష్మిక ఫోటోలను వాడేసుకుంటున్నారు. అయితే రష్మిక గుండు ఫోటోలను చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. మరోవైపు రష్మిక గుండు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్‌ సృష్టిస్తూ మీమర్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలు చూస్తే ఈ కన్నడ భామ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి!

Read: Corona Second Wave: ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ల చోరీ.. విచారణకు ఆదేశాలు!