మాస్ మహారాజా బర్త్‌డే సర్‌ప్రైజ్

మాస్ మహారాజా బర్త్‌డే సర్‌ప్రైజ్

Updated On : January 26, 2021 / 12:32 PM IST

Khiladi First Glimpse: ఈ సంక్రాంతికి ‘క్రాక్‌’ తో బ్లాక్‌బస్టర్‌ మాస్ హిట్ అందుకున్న మాస్‌ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’.. ‘వీర’ తర్వాత వీరి కలయికలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడా సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఖిలాఢి’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేసింది చిత్రబృందం.. స్టైలిష్‌ లుక్‌లో రవితేజ ఒక రాడ్ లాంటి వెపన్ పట్టుకుని నడుస్తున్నట్లు గ్లింప్స్‌ వీడియోలో చూపించారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాఢి’ లో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.