Raviteja: స్పెయిన్‌లో రవితేజ ‘ధమాకా’ రొమాన్స్!
మాస్ రాజా రవితేజ ఇటీవల ‘ఖిలాడి’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో తన నెక్ట్స్ చిత్రాలను ఎలాగైనా సక్సెస్....

Dhamaka Song Shoot In Spain
Raviteja: మాస్ రాజా రవితేజ ఇటీవల ‘ఖిలాడి’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో తన నెక్ట్స్ చిత్రాలను ఎలాగైనా సక్సెస్ చేయాలని చూస్తున్న రవితేజ, వాటిని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలిన భావిస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ అనే సినిమాలో నటిస్తున్న ఈ హీరో, ఈ సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన పలు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేశాడు.
Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!
అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ అందమైన సాంగ్ షూట్ కోసం ‘ధమాకా’ చిత్ర యూనిట్ ఫారిన్ వెళ్లారు. స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్స్‌లో అంతకంటే అందమైన ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు రవితేజ్ అండ్ టీమ్ రెడీ అయ్యారు. కాగా ఈ పాట షూటింగ్‌ను ప్రారంభించినట్లు సినిమా సెట్స్ నుండి తాజాగా ఓ ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.
ఇక మాస్ రాజా ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనుండగా, ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతుండటంతో మాస్ రాజా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది క్రాక్ చిత్రంతో రవితేజ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, ఇటీవల ఖిలాడి సినిమాతో తిరిగి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు.
Raviteja: పాతిక రోజులకు అంత రేటా..?
దీంతో ధమాకా చిత్రం ఎలాగైనా మాస్ రాజాకు తిరిగి అదిరిపోయే సక్సెస్‌ను అందించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించి రిలీజ్ చేయాలని రవితేజ్ అండ్ టీమ్ భావిస్తున్నారు. మరి ధమాకా చిత్రంతో రవితేజ నిజంగానే ధమాకా లాంటి విజయాన్ని అందుకుంటాడా లేడా అనేది చూడాలి.