Realme 10 Pro Series : డిసెంబర్ 8న రియల్‌మి 10ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Realme 10 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme నుంచి భారత మార్కెట్లో రియల్‌మి10 సిరీస్‌లను అధికారికంగా లాంచ్ చేయనుంది. రియల్‌మి నుంచి రెండు ఫోన్‌లలో రెడ్‌మి 10, రెడ్‌మి 10 ప్రో మోడల్స్.. డిసెంబర్ 8న భారత్‌లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Realme 10 Pro Series to launch in India on December 8
Realme 10 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme నుంచి భారత మార్కెట్లో రియల్‌మి10 సిరీస్‌లను అధికారికంగా లాంచ్ చేయనుంది. రియల్‌మి నుంచి రెండు ఫోన్‌లలో రెడ్‌మి 10, రెడ్‌మి 10 ప్రో మోడల్స్.. డిసెంబర్ 8న భారత్‌లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ప్రొడక్టుల లిస్టు పేజీ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. Realme 10 సిరీస్ గతంలో చైనాలో లాంచ్ అయింది. Redmi 10 Pro Qualcomm చిప్‌సెట్‌తో వస్తుంది. అయితే Redmi 10లో MediaTek చిప్‌సెట్ ఉంటుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్లు 108-MP కెమెరా సెన్సార్, కర్వ్డ్ డిస్ప్లేతో పాటు 4500mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. కొత్త సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించడానికి Realme సోషల్ మీడియా మీదుగా రివీల్ చేసింది. Realme 10 Pro సిరీస్ డిసెంబర్ 8న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ కానుంది.
Realme 10 Pro,10 Pro Plus : ధర అంచనా ఎంతంటే? :
రియల్‌మి నుంచి Realme 10 Pro 8GB, 12GB సహా రెండు వేరియంట్‌లలో లాంచ్ కానుంది. 8GB వేరియంట్ ధర CNY 1,599 (దాదాపు రూ. 18,200), 12GB RAM, 256GB స్టోరేజ్‌తో టాప్ వేరియంట్‌ప్ స్టోరేజ్ మోడల్ ధర CNY 1899 (దాదాపు రూ. 21,635)గా ఉండనుంది. మరోవైపు, Realme 10 Pro Plus 8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్ కోసం CNY1,699 (దాదాపు రూ. 19,300)గా ఉంది. 8GB RAM, 256GB ఆప్షన్ CNY 1,999 (దాదాపు రూ. 22,700), 12GB, 256GB ఆప్షన్ ధర CNY2,399 (దాదాపు రూ. 27,300) కలిగి ఉంటుంది.

Realme 10 Pro Series to launch in India on December 8
స్పెసిఫికేషన్‌లు ఇవే :
Realme 10 Pro+ Full HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేతో పాటు రాబోయే రియల్‌మి సిరీస్‌లో మొదటిదిగా చెప్పవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. Realme 10 Pro+ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 1080 SoCతో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్-కెమెరా సిస్టమ్ 108-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ 16-MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

Realme 10 Pro Series to launch in India on December 8
Realme 10 Pro Full-HD రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Realme Pro 12GB RAM, 256GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108-MP ప్రైమరీ కెమెరాతో పాటు కేవలం 2-MPడెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఒకే 16MP కెమెరా కూడా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి. Realme 10 Proలో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Realme 10 Pro : 108MP ప్రైమరీ కెమెరాలతో రియల్‌మి10ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే..?