Realme 10 Pro : 108MP ప్రైమరీ కెమెరాలతో రియల్‌మి10ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే..?

Realme 10 Pro : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రియల్‌మి 10 ప్రో సిరీస్ వచ్చేసింది. అందులో రియల్‌మి 10ప్రో (Realme 10 Pro), రియల్‌మి 10ప్రో+ (Realme 10 Pro+) ఎట్టకేలకు లాంచ్ అయ్యాయి.

Realme 10 Pro : 108MP ప్రైమరీ కెమెరాలతో రియల్‌మి10ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే..?

Realme 10 Pro, 10 Pro+ with 108MP main camera officially launched

Realme 10 Pro : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రియల్‌మి 10 ప్రో సిరీస్ వచ్చేసింది. అందులో రియల్‌మి 10ప్రో (Realme 10 Pro), రియల్‌మి 10ప్రో+ (Realme 10 Pro+) ఎట్టకేలకు లాంచ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో రెగ్యులర్ రియల్‌మి 10ని ప్రవేశపెట్టిన కొన్ని రోజుల తర్వాత.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. స్పెసిఫికేషన్‌ల పరంగా రెండూ చాలా భిన్నంగా ఉంటాయి. Realme 10 Pro Qualcomm చిప్‌సెట్‌తో వస్తుంది. మరో వెర్షన్ MediaTek చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు 108-MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

Realme 10 Pro ధర, ఫీచర్లు ఇవే :
Realme 10 Pro యూనిబాడీ బ్యాక్ ప్యానెల్, రెండు బ్యాక్ కెమెరాలతో Realme 9iని పోలి ఉంటుంది. ఈ ఫోన్ Full-HD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 680నిట్‌ల బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. పవర్ బటన్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్‌గా అవుతుంది. హుడ్ కింద, Realme Pro స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ను 12GB RAM, 256GB స్టోరేజీతో వచ్చింది. దీని వెనుక కెమెరా సిస్టమ్‌లో 108-MP ప్రైమరీ కెమెరా, కేవలం 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

Realme 10 Pro, 10 Pro+ with 108MP main camera officially launched

Realme 10 Pro, 10 Pro+ with 108MP main camera officially launched

సెల్ఫీల కోసం ముందు భాగంలో ఒకే 16MP కెమెరా కూడా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి. Realme 10 Proలో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు. అందుకే ఫోన్ బేస్ వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర CNY 1,599 (దాదాపు రూ. 18,200, 12GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన టాప్ స్టోరేజ్ మోడల్ ధర CNY 1899 (దాదాపు రూ. 21,635) కలిగి ఉంది.

Realme 10 Pro+ ధర, ఫీచర్లు ఇవే :
స్మార్ట్‌ఫోన్‌లో వెనుక 3 కెమెరాలు ఉన్నప్పటికీ.. రియల్‌మి 10ప్రో కూడా మాదిరిగానే కనిపిస్తుంది. Realme కొత్త ఫోన్‌లలో అదే సర్కిల్ కటౌట్ లోపల సెకండరీ కెమెరా పక్కన మూడో సెన్సార్‌ను యాడ్ చేసింది. Realme 10 Pro+ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే కర్వడ్ కూడా కలిగి ఉంది. Realme నంబర్ సిరీస్‌కి మొదటిది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 1080 SoC ద్వారా 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చింది. దీని వెనుక కెమెరా సిస్టమ్‌లో 108-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో షూటర్ ఉన్నాయి.

Realme 10 Pro, 10 Pro+ with 108MP main camera officially launched

Realme 10 Pro, 10 Pro+ with 108MP main camera officially launched

సెల్ఫీల కోసం ఫోన్ 16-MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉన్నాయి. దీని ధర 8GB RAM, 128GB స్టోరేజీ ఆప్షన్ కోసం CNY1,699 (దాదాపు రూ. 19,300) నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM, 256GB ఆప్షన్ CNY 1,999 (దాదాపు రూ. 22,700), 12GB, 256GB ఆప్షన్ CNY2,399 (దాదాపు రూ. 27,300) ధరను కలిగి ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Series : అద్భుతమైన కెమెరాలతో రియల్‌మి 10 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?