Uday Kiran : ఉదయ్ కిరణ్ జయంతి..

ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వారు సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కిరణ్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు..

Uday Kiran : ఉదయ్ కిరణ్ జయంతి..

Remembering Uday Kiran On His Birth Anniversary

Updated On : June 26, 2021 / 1:34 PM IST

Uday Kiran: ఉదయ్ కిరణ్.. ‘చిత్రం’ తో కెరీర్ స్టార్ట్ చేసి, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకుని లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

ఉదయ్ కిరణ్ జయంతి నేడు(జూన్ 26).. ఈ సందర్భంగా ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వారు సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కిరణ్‌తో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ‘కలుసుకోవాలని’, ‘శ్రీరామ్’, ‘నీస్నేహం’ ‘నీకు నేను నాకు నువ్వు’, ‘ఔనన్నా కాదన్నా’, ‘గుండె ఝల్లుమంది’ వంటి సినిమాలతో అలరించిన ఉదయ్ కిరణ్ హీరోగా రిలీజ్ అయిన చివరి సినిమా ‘జై శ్రీరామ్’..

నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’… ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాత, ఉదయ్ కిరణ్ అసిస్టెంట్ మున్నా కొద్దికాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయ్ 2014 జనవరి 6 న ఈలోకాన్ని విడిచివెళ్లారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా నటించిన సినిమాలు, పోషించిన క్యారెక్టర్ల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు ఉదయ్ కిరణ్.