Ram Gopal Varma: చిరంజీవితో పూరి జగన్నాథ్ సినిమాపై వర్మ కామెంట్స్..
టాలీవుడ్ బిగ్ బాస్ చిరంజీవి నటించిన “గాడ్‌ఫాదర్” ఈ దసరాకు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో కలిసి నిన్న రాత్రి చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్, పూరీతో..

RGV Tweet on Chiru and Puri Jagannadh Movie
Ram Gopal Varma: టాలీవుడ్ బిగ్ బాస్ చిరంజీవి నటించిన “గాడ్‌ఫాదర్” ఈ దసరాకు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి చెప్పినట్లు ఈ సినిమా ఒక నిశ్శబ్దపు విస్ఫోటనం, ఎందుకంటే మొదటి వారం పూర్తీ అయ్యేసరికి ఈ సినిమా రూ.100 కోట్లు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డుల మోత మోగిస్తుంది.
RGV : మా చిరంజీవిని అంటావా.. గరికపాటిపై ఆర్జీవీ తీవ్ర విమర్శలు..
ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో కలిసి నిన్న రాత్రి చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్, పూరీతో.. “నువ్వు నాకోసం రాసిన ‘ఆటో జానీ’ కథ ఏమైంది” అని ప్రశ్నించాడు. దానికి డైరెక్టర్ బదులిస్తూ.. “అది పక్కన పెట్టేసా సార్, మరో కొత్త కథ సిద్ధం చేస్తా” అని చెప్పుకొచ్చాడు.
దీంతో వీరిద్దరి కలయికలో త్వరలో ఒక సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించాడు. “సినిమా అంటే ప్రాణం ఇచ్చే ఇద్దరు వ్యక్తులు ఒక సినిమా కోసం కలవబోతున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా” అని ట్వీట్ చేశాడు వర్మ.