Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

కృష్ణా జిల్లాలో వివాహ వేడుక సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కాసానగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

Road Accident

Updated On : May 26, 2022 / 3:39 PM IST

Road Accident: కృష్ణా జిల్లాలో వివాహ వేడుక సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కాసానగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెండ్లి బృందం చల్లపల్లి మండలం చింతలమడ నుంచి మోపిదేవి మండలం పెడబ్రోలు వెళ్తుండగా, వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై బోల్తా పడి, దాదాపు 20 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స

మృతులను గుర్రం విజయ (50), బూరెపల్లి రమణ (52), బూరెపల్లి వెంకటేశ్వరమ్మ (50), కోన వెంకటేశ్ (70)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను డీస్పీ మహబూబ్ బాషా నేతృత్వంలో ఆసుపత్రికి తరలించారు. కాగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.