RRR Film Update: ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ ఒకరా.. ఇద్దరా?

టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ ఏదంటే ముందుగా వినిపించే పేరు ఆర్ఆర్ఆర్. మెగా-నందమూరి హీరోలను కలిపి తెరకెక్కించే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాటల్లో చెప్పలేం.

RRR Film Update: ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ ఒకరా.. ఇద్దరా?

Rrr Film

Updated On : April 25, 2021 / 1:11 PM IST

RRR Film Update: టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ ఏదంటే ముందుగా వినిపించే పేరు ఆర్ఆర్ఆర్. మెగా-నందమూరి హీరోలను కలిపి తెరకెక్కించే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాటల్లో చెప్పలేం. దీనికి తోడు కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చివరికి హాలీవుడ్ నుండి కూడా అందరినీ ఈ సినిమా కోసం తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి ఒక్కో టీజర్ విడుదల చేసి అంచనాలను అమాంతం పెంచేశారు. అందుకే ఈ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకి వచ్చినా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా.. ఇప్పుడు ప్రచారమవుతున్న విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ ఇద్దరు నటించనున్నారని. ఈ సినిమాలో అడవిజాతి బాగు కోసం బతుకును ధారపోసి ప్రాణాలను వదిలిన త్యాగమూర్తి గోండ్రు బొబ్బిలి కొమరం భీం పాత్రలో తారక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుందని ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం.

అయితే ఇప్పుడు తారక్ సరసన ఒలివియా కాకుండా మరో హీరోయిన్ కూడా నటిస్తుందని చెప్తున్నారు. కొమరం భీం పాత్ర జీవితంలో ఇద్దరు స్త్రీలు ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ చుట్టే రాజమౌళి గొప్ప ప్రేమ కథను అల్లాడని.. ఎన్టీఆర్ ట్రాక్ లో గొప్ప లవ్ స్టోరీ ఉండబోతుందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో.. ఎన్టీఆర్ సరసన నటించే ఆ మరో హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read: The Family Man-2: త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న సమంత వెబ్ సిరీస్!