The Family Man-2: త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న సమంత వెబ్ సిరీస్!

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఇండియాలో ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తుంది. సినిమాల నుండి వెబ్ సిరీస్ ల వరకు ఏదైనా అందరి చూపు ఓటీటీ వైపే. అంతకు ముందు వెబ్ సిరీస్ లంటే మన ప్రేక్షకులకు పరిచయం ఉన్నా.. లాక్ డౌన్ తర్వాత మాత్రం వెబ్ సిరీస్ లవర్స్ ఏర్పడ్డారు. మేకర్స్ కూడా ఇప్పుడు ఈ వెబ్ చిత్రాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

The Family Man-2: త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న సమంత వెబ్ సిరీస్!

The Family Man 2

The Family Man-2: కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఇండియాలో ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తుంది. సినిమాల నుండి వెబ్ సిరీస్ ల వరకు ఏదైనా అందరి చూపు ఓటీటీ వైపే. అంతకు ముందు వెబ్ సిరీస్ లంటే మన ప్రేక్షకులకు పరిచయం ఉన్నా.. లాక్ డౌన్ తర్వాత మాత్రం వెబ్ సిరీస్ లవర్స్ ఏర్పడ్డారు. మేకర్స్ కూడా ఇప్పుడు ఈ వెబ్ చిత్రాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోల నుండి హీరోయిన్స్ వరకు ఈ బుల్లి చిత్రాలకు సై అంటున్నారు. మారుతున్న కాలంతో స్టార్స్ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు.

టాలీవుడ్ గ్లామ‌ర్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత ఇప్పటికే ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా డిజిటల్ లోకి అడుగుపెట్టగా ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2తో నటిగా కూడా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. దీనికి సీక్వెల్‌గా ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత న‌టిస్తుంది అనే సరికి దీనిపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. నిజానికి ఇది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కావ‌ల‌సి ఉండగా ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇందులో స‌మంత పాత్ర మీద కూడా చాలా కాలంగా కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో సామ్ నెగెటివ్ షేడ్‌లో న‌టిస్తుంద‌ని, ఆమె పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని విధంగా ఉంటుంద‌ని స‌మాచారం. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత ఉగ్రవాది పాత్రలో క‌నిపించ‌నుండగా కొన్ని వివాద‌స్ప‌ద సన్నివేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ వివాదాస్పద సన్నివేశాలనే రీ షూట్ చేయగా అన్నీ పూర్తిచేసుకొని మే నెలలో విడుదల కానున్నట్లుగా తెలుస్తుంది. మరి సామ్ తొలి వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి!