Yashoda Movie : ‘యశోద’పై సమంత స్పెషల్ ట్వీట్..

తాజాగా యశోద సినిమాపై స్పెషల్ ట్వీట్ చేసింది సమంత. తన ఫోటో ఒకటి షేర్ చేసి.. ''చాలా భయంగా, ఆతృతగా ఉంది. యశోద రిలీజ్ అవ్వడానికి ఒక్క రోజే సమయం ఉంది. మీ అందరికి..............

Yashoda Movie : ‘యశోద’పై సమంత స్పెషల్ ట్వీట్..

samantha special tweet on Yashoda Movie

Updated On : November 10, 2022 / 9:39 AM IST

Yashoda Movie :  చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

Samantha : యశోద ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇన్ని కోట్లా.. మరి సమంత అంత రాబడుతుందా??

సమంత కూడా యశోద ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాజాగా యశోద సినిమాపై స్పెషల్ ట్వీట్ చేసింది సమంత. తన ఫోటో ఒకటి షేర్ చేసి.. ”చాలా భయంగా, ఆతృతగా ఉంది. యశోద రిలీజ్ అవ్వడానికి ఒక్క రోజే సమయం ఉంది. మీ అందరికి యశోద నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చిత్ర యూనిట్ అందరికి మంచి జరుగుతుంది. అందరం రేపు మీరిచ్చే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం. సినిమా మమ్మల్ని దాటి మీ ముందుకి రాబోతుంది” అని పోస్ట్ చేసింది. దీంతో సమంత చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.