SBI Loans: గుడ్ న్యూస్.. బంగారు రుణాలపై భారీగా వడ్డీరేట్ల రాయితీ!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బంగారు రుణాల(gold Loans)పై బ్యాంక్ భారీగా వడ్డీరేట్లను తగ్గించింది. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలలో బంగారు రుణాలు పొందడం అధికమైంది. దీంతో వివిధ బ్యాంకులు వివిధ రకాలు ఆఫర్లు, వడ్డీరేట్ల తగ్గింపు చేపట్టారు.

SBI Loans: గుడ్ న్యూస్.. బంగారు రుణాలపై భారీగా వడ్డీరేట్ల రాయితీ!

Sbi Loans

Updated On : August 5, 2021 / 5:05 PM IST

SBI Loans: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బంగారు రుణాల(gold Loans)పై బ్యాంక్ భారీగా వడ్డీరేట్లను తగ్గించింది. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలలో బంగారు రుణాలు పొందడం అధికమైంది. దీంతో వివిధ బ్యాంకులు వివిధ రకాలు ఆఫర్లు, వడ్డీరేట్ల తగ్గింపు చేపట్టారు.

ఇదే క్రమంలో ఎస్‌బీఐ కూడా భారీ వడ్డీ రేట్ల రాయితీని ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకుంటుంది. గోల్డ్‌రుణాల వడ్డీరేట్లపై ఎస్ బీఐ సుమారు 0.75 శాతం రాయితీను అందించనుంది. ఈ ఆఫర్‌ 2021 సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉండనుండగా ఈ అవకాశాన్ని తమ కస్టమర్లు వినియోగించుకోవాలని ఎస్‌బీఐ కోరింది.

ఇక ఎస్‌బీఐ గోల్డ్‌లోన్‌లను ఇప్పుడు యోనో యాప్‌ను ఉపయోగించి కూడా రుణాలను పొందవచ్చునని తెలిపింది. యోనో యాప్ లోకి లాగిన్ అయి లోన్స్.. గోల్డ్ లోన్స్ వరకు వెళ్లి అక్కడ మీ ఆభరణాల వివరాలు నమోదు చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సమీప బ్రాంచ్ వద్దకు వెళ్లి కేవైసీ చేయించి లోన్ అప్లికేషన్ మీద సంతకాలు చేసి బంగారాన్ని నిర్ధారించుకుంటే రుణాన్ని ఖాతాలో జమచేయనున్నారు.