Husband Cheated: భర్త ఇంటికి వచ్చిన రెండో భార్యపై మొదటి భార్య దాడి

కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వేణు గోపాల్ అనే వ్యక్తికి తన అక్క కూతురుతో వివాహం జరిగింది. అయితే, మ్యాట్రిమొని సైట్‌లో తనకు పెళ్లి కాలేదని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్ చూసి నమ్మిన రూప అనే మహిళ, వేణు గోపాల్‌ను పెళ్లి చేసుకుంది.

Husband Cheated: భర్త ఇంటికి వచ్చిన రెండో భార్యపై మొదటి భార్య దాడి

Husband Cheated

Updated On : June 13, 2022 / 3:57 PM IST

Husband Cheated: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన రెండో భార్యపై, దాడి చేసింది మొదటి భార్య. ఈ ఘటన నెల్లూరు జిల్లా, గూడురు, బాలాజీ నగర్‌లో జరిగింది. కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వేణు గోపాల్ అనే వ్యక్తికి తన అక్క కూతురుతో వివాహం జరిగింది. అయితే, మ్యాట్రిమొని సైట్‌లో తనకు పెళ్లి కాలేదని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్ చూసి నమ్మిన రూప అనే మహిళ, వేణు గోపాల్‌ను పెళ్లి చేసుకుంది. రూప అనంతపురం జిల్లా కదిరిలో మహిళా పోలీసుగా పని చేస్తోంది. ఇద్దరూ పెళ్లి తర్వాత కొంతకాలం కదిరిలోనే కలిసున్నారు. అయితే, పెళ్లయిన తర్వాత నెల్లూరు తీసుకెళ్లమని భర్తను అడుగుతుండేది రూప.

Child Reunited: ఆసుపత్రిలో బిడ్డ తారుమారు.. మూడేళ్లకు తల్లిందండ్రుల చెంతకు

కానీ, ప్రతిసారీ ఏదో కారణం చెబుతూ కాలయాపన చేస్తుండటంతో రూపకు అనుమానం వచ్చింది. దీంతో విషయం ఆరా తీయగా, తనకు అప్పటికే పెళ్లైందని నిజం తెలిసింది. వెంటనే మోసపోయానని గ్రహించిన రూప బాలాజీ నగర్‌లో ఉంటున్న తన భర్త ఇంటికి వెళ్లింది. తనకు న్యాయం చేయాలని ఆందోళన చేసింది. అక్కడ వేణుగోపాల్ మొదటి భార్య, కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. బాధిత మహిళ ఈ అంశంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.