Covid in Supreme Court: సుప్రీంకోర్టులో 10మంది న్యాయమూర్తులకు కరోనా..మరో 400మంది సిబ్బందికి కూడా

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. సుప్రీంకోర్టులో 10మంది న్యాయమూర్తులు కోవిడ్ బారిన పడ్డారు. మరో 400ల మంది సుప్రీంకోర్టు సిబ్బందికి క‌రోనా సోకింది.

Covid in Supreme Court: సుప్రీంకోర్టులో 10మంది న్యాయమూర్తులకు కరోనా..మరో 400మంది సిబ్బందికి కూడా

Covid In Supreme Court..10 Judges Positive

Updated On : January 19, 2022 / 12:23 PM IST

Covid in Supreme Court..10 judges Positive: దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. సుప్రీంకోర్టులో 10మంది న్యాయమూర్తులు కోవిడ్ బారిన పడ్డారు. మరో 400ల మంది సుప్రీంకోర్టు సిబ్బందికి క‌రోనా సోకింది. ధర్మాసనంలో కోవిడ్ టెన్షన్ రేపుతున్న క్రమంలో గత 10 రోజుల్లో కోవిడ్ సోకినవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. 32మంది న్యాయమూర్తుల్లో 10మంది మహమ్మారి బారిన పడ్డారు.కోవిడ్ సోకి ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తులు సెలవుల్లో ఉన్నారు. ఈక్రమంలో మరో 10మంది జడ్జీలకు కోవిడ్ సోకటంతో బాధితుల‌కు న్యాయ‌స‌హాయం అందించ‌డంలో ఆల‌స్య‌మ‌వుతోంది.

Also read : Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి

సుప్రీంకోర్టులోని 32 మంది జ‌డ్జిల్లో ఇప్ప‌టివ‌ర‌కు పది మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఇందులో జ‌స్టిస్ కేఎం జోసెఫ్‌, పీఎస్ న‌ర‌సింహ క‌రోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. మ‌రో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.

అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో.. కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌యింది. ప్ర‌తిరోజు 100 నుంచి 200 మందికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. పలు కేసుల్లో లక్షణాలు లేకుండానే ఎటాక్ అవుతోంది. దీంతో ప్ర‌తిరోజు స‌రాస‌రి 30 శాతం కేసులు న‌మోద‌వుతున్నాయి. కోర్టులో మొత్తం 15 వంద‌ల మంది సిబ్బంది ఉండ‌గా సుమారు 400 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.

Also read : Strange Baby : నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన శిశువు..బిడ్డను చూసి తల్లడిల్లిపోతున్న తల్లి