Shashi Tharoor : శశి థరూర్ ఒడిలో కూర్చుని అక్షరాలు దిద్దుతున్న చిన్నారి ఎవరంటే?

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు. రెండేళ్ల చిన్నారికి అక్షరాభ్యాసం చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?

Shashi Tharoor : శశి థరూర్ ఒడిలో కూర్చుని అక్షరాలు దిద్దుతున్న చిన్నారి ఎవరంటే?

Shashi Tharoor

Updated On : May 23, 2023 / 2:51 PM IST

MP Shashi Tharoor shares sweet ritual : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన నియోజకవర్గానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి విషయంలో తాను చేసిన మంచి పనిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

శశి థరూర్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పోస్టులకు జనం బాగా స్పందిస్తారు. రీసెంట్‌గా తన నియోజకవర్గానికి చెందిన అనంత పద్మనాభన్ అనే రెండేళ్ల చిన్నారికి శశి థరూర్ అక్షరాభ్యాసం చేశారు. @ShashiTharoor అనే తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని స్వయంగా పోస్ట్ చేశారు. అనంత పద్మనాభన్ తన సహోద్యోగి కుమారుడని ట్వీట్ లో పేర్కొన్నారు. బాలుడి చేతిని తన వేలితో పట్టుకుని బియ్యం ఉన్న పళ్లెంలో మళయాళం, సంస్కృతం మరియు ఇంగ్లీషులో “ఓం హరి శ్రీ” అని రాయించారు. థరూర్ కబుర్లు చెబుతూ ఆ చిన్నారి సంతోషంగా అక్షరాలు రాసాడు. ఈ ఫోటోలు చూసిన జనం స్పందించారు.

Shashi Tharoor: శశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి.. తప్పేం లేదంటున్న నెటిజెన్లు

‘అనంత పద్మనాభన్ ఎంత అదృష్టవంతుడో ? మీ చేతులతో అక్షరాలు రాయిస్తున్నారు’ అని ఒకరు.. ‘అతను ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాడు అని మరొకరు’.. కామెంట్లు చేశారు.