Karnataka: బెంగళూరు జంట హత్యల కేసుకు సంబంధించి షాకింగ్ వీడియో

హత్యలకు ముందు నేరస్తుడు శబరీష్‌ అలియాస్‌ ఫెలిక్స్‌ జంట హత్యకు ముందు వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్ ఆసక్తికరంగా మారింది. ‘‘లోకమంతా చెడ్డవాళ్లు, మోసగాళ్లతో నిండిపోయింది. నేను చెడు వ్యక్తులను మాత్రమే ఇబ్బంది పెడతాను’’ అంటూ నిందితుడు ఫెలిక్స్ తన వాట్సాప్ స్టేటస్ పెట్టాడు

Karnataka: బెంగళూరు జంట హత్యల కేసుకు సంబంధించి షాకింగ్ వీడియో

Updated On : July 13, 2023 / 4:25 PM IST

Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో విడులదైంది. ఆ వీడియోలో నిందితుడు హత్య అనంతరం వెనుక గేటు నుంచి పారిపోవడాన్ని చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివి అధికారిని హత్య చేసిన మరుసరటి రోజే ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో వచ్చిన ఘర్షణ కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Sadha : గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ఈమధ్య విడిపోతున్నారు.. హీరోయిన్ సదా కామెంట్స్ వైరల్..

వీడియో ప్రకారం.. ముగ్గురు నిందితులు.. హత్య అనంతరం వెనక గేటు నుంచి పారిపోవడం సీసీటీవీ కెమెరాలో చిక్కింది. ఇక ముగ్గురు నిందితులు ఫెలిక్స్, వినయ్ రెడ్డి, సంతోష్ అని పోలీసులు వెల్లడించారు. ఇందులో ఫెలిక్స్ ప్రధాన నిందితుడు. వ్యాపారంలో ఇతడితో ఇద్దరు మృతులకు గొడవలు అయ్యాయి. ఇక సంతోష్ మాజీ ఉద్యోగి కాగా, ఫెలిక్స్ కి వినయ్ రెడ్డి స్నేహితుడు.

ఇక జంట హత్యలకు ముందు నేరస్తుడు శబరీష్‌ అలియాస్‌ ఫెలిక్స్‌ జంట హత్యకు ముందు వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్ ఆసక్తికరంగా మారింది. ‘‘లోకమంతా చెడ్డవాళ్లు, మోసగాళ్లతో నిండిపోయింది. నేను చెడు వ్యక్తులను మాత్రమే ఇబ్బంది పెడతాను’’ అంటూ నిందితుడు ఫెలిక్స్ తన వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఇప్పుడిది బయటికి రావడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. “ఎప్పుడూ పొగిడేవాళ్ళు, మోసం చేసేవారితో ప్రపంచం నిండిపోయింది. అందుకే నేను ఈ ప్రజలను బాధించాను. నేను చెడ్డ వ్యక్తులను మాత్రమే బాధించాను. నేను మంచి వ్యక్తులను ఎప్పుడూ బాధించలేదు” అని హత్యకు ముందు ఫెలిక్స్ తన వాట్సాప్ స్టేటస్ షేర్ చేశాడు.

Wagner Boss: రష్యా అధ్యక్షుడు పుతిన్‭పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్‭ను హతమార్చారా? అమెరికా సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు

గతంలో ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీలో పనిచేసిన ఫెలిక్స్‌కు ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో వినుకుమార్‌తో వైరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జూలై 11న సాయంత్రం 4 గంటలకు కత్తితో టెక్ సంస్థలోకి ప్రవేశించిన అతడు.. ఫణీంద్ర, వినుకుమార్‌లను కత్తితో పొడిచి పారిపోయాడు.